మ‌హిళ‌లూ ఈ విష‌యం అస్స‌లు మ‌రువొద్దు: ఉపాస‌న‌

మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందించిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపజేస్తోంది.;

Update: 2026-03-08 17:53 GMT

మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందించిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ ప్రత్యేక రోజున కేవలం శుభాకాంక్షలు తెల‌ప‌డమే కాకుండా.. మహిళా సాధికారత వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి తనదైన శైలిలో స్పందించారు. ప్రతి మహిళ తనలో ఉన్న శక్తిని గుర్తించి, సమాజం విధించే కట్టుబాట్లను దాటి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీనికి మించి త‌న రూపం ప‌లు స‌మ‌యాల‌లో త‌న రూపం ఎలా మారిందో.. త‌న బ‌రువు, శారీర‌క రూపంలో మార్పులు ఎలా ఉన్నాయో తెలియ‌జేస్తూ ఉపాస‌న‌ కొన్ని ఫోటోల‌ను కూడా షేర్ చేయ‌డంతో అది చ‌ర్చ‌గా మారింది. జీవితంలో ప‌లు ద‌శ‌ల్లో తాను ధ‌రించిన‌ ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తులు శ‌రీరాకృతిలో మార్పుల‌ను కూడా ఈ ఫోటోలు ఆవిష్క‌రించాయి. బ‌హుశా మ‌హిళ‌లు త‌మ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి మాట్లాడేందుకు ఉపాస‌న సంసిద్ధ‌త‌గా చూడాలి.




ఉపాసన తన సందేశంలో ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం, వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు ఇతరులను సంరక్షించడంలో ఎప్పుడూ ముందుంటారు.. కానీ అదే సమయంలో వారు తమ స్వయం సంరక్షణను మర్చిపోకూడదు! అని పేర్కొన్నారు. ఒక తల్లిగా, ఒక వ్యాపారవేత్తగా .. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా తను ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఉపాస‌న‌ ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావిస్తూ మహిళలందరిలో స్ఫూర్తిని నింపారు.




తాజాగా ఉపాస‌న మెంటల్ హెల్త్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమపై తాము ఒత్తిడి పెంచుకోకుండా.. అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం.. సహాయం కోరడం నేర్చుకోవాలని ఉపాసన తెలిపారు. పరిపూర్ణంగా ఉండటం కంటే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటం ముఖ్యం! అనే విషయాన్ని ఉపాస‌న‌ మహిళా దినోత్సవం వేళ మరోసారి గుర్తుచేశారు.

కుటుంబం, వృత్తిపరమైన బాధ్యతల మధ్య నలిగిపోయే మహిళలకు ఉపాసన ఒక గొప్ప రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఉంటూనే, తన సొంత వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ అపోలో ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ ప్రయాణంలో తనకు తన కుటుంబం, ముఖ్యంగా భర్త రామ్ చరణ్ ఇచ్చే మద్దతు ఎంతో గొప్పదని ఉపాస‌న‌ పలు సందర్భాల్లో కృతజ్ఞతగా చెప్పుకొచ్చారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాస‌న షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం మాటలతో కాకుండా.. చేతలతో మహిళల సంక్షేమం కోసం పని చేస్తున్న ఉపాసనను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సమాజంలో మహిళలు పోషిస్తున్న బహుముఖ పాత్రలను త‌న‌ సందేశం ద్వారా గౌరవించారు. ప్రతి మహిళ ఒక యోధురాలని కొనియాడారు.

చివరగా ఉపాసన కొణిదెల తన ప్రసంగాన్ని ముగిస్తూ.. భవిష్య‌త్ తరాల మహిళలకు దారి చూపడం మన బాధ్యత అని గుర్తుచేశారు. మహిళలందరూ ఐకమత్యంగా ఉంటూ ఒకరికొకరు తోడుగా నిలబడాలని అప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆకాంక్షించారు. ఈ స్ఫూర్తిదాయకమైన సందేశం మహిళా దినోత్సవం వేళ మరింత మందికి ధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.



Tags:    

Similar News