రెడ్ అవుట్ ఫిట్ లో చెమటలు పట్టిస్తున్న రాధిక!
ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి సోషల్ మీడియా సెలబ్రిటీలకు అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ గా మారుతున్న విషయం తెలిసిందే.;
ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి సోషల్ మీడియా సెలబ్రిటీలకు అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ గా మారుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కొంతమంది గ్లామర్ వలకబోస్తూ అందాలను షేర్ చేస్తుంటే.. మరికొంతమంది సాంప్రదాయంగా కనిపిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అలాంటి వారిలో డీజే టిల్లు సినిమాలో రాధికా పాత్రతో కుర్రాళ్ల గుండెల్లో గుణపాలు దింపిన నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఒక్క సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ ఒక్క సినిమా ఈమెను రాధికగా మార్చేసిందనే చెప్పాలి. బయట ఎక్కడ కనిపించినా సరే టిల్లు రాధిక అని పిలుస్తున్నారే తప్ప నేహా శెట్టి అని పిలిచేవారు చాలా తక్కువ అని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో మళ్లీ దర్శనం ఇచ్చిన నేహా శెట్టి.. తాజాగా రెడ్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా రెడ్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అంతేకాదు ఉమెన్స్ డే సందర్భంగా నేహా శెట్టి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. ఇక ఉమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు హ్యాపీ ఉమెన్స్ డే అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది ఈ విశ్వంలోనే అత్యంత అందమైన అమ్మాయి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన నేహా శెట్టి.. ఇలా రెడ్ అవుట్ ఫిట్ లో సందడి చేసి అభిమానులలో చెమటలు పట్టించింది.
1997 డిసెంబర్ 5న మంగళూరులో జన్మించిన నేహా శెట్టి.. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. వాస్తవానికి తుళు మాట్లాడే హిందూ కుటుంబంలో జన్మించిన ఈమె.. బెంగళూరులో పెరిగింది. ఈమె తల్లి దంత వైద్యురాలు కాగా.. తండ్రి వ్యాపారవేత్త. ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. తన కెరియర్ మోడలింగ్ తోనే ప్రారంభించిన ఈమె .. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీలో టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత సౌత్ ఇండియా 2015లో రన్నరప్ గా నిలిచిన ఈమె.. ఆ తర్వాత అటు కన్నడలో కూడా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన మెహబూబా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఇకపోతే ఈమెకు అంతకుముందు తెలుగు రాకపోయినా ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకొని మరీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మెహబూబా సినిమా తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీలో నటన కోసం అభ్యసించడానికి ఇండస్ట్రీకి 6 నెలలు గ్యాప్ తీసుకున్న ఈమె.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. కానీ డీజే టిల్లులో నటించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక చివరిగా డ్యూడ్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.