మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు: సిద్దార్థ్
అక్కినేని నాగ చైతన్య - సమంత జంట వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. భార్యాభర్తల బంధానికి దూరంగా ఉండాలనుకుంటున్నామని.. చాలా చర్చలు జరిపి ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇకపై వేర్వేరుగా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని అభిమానులను మీడియాకు విజ్ఞప్తి చేసినా.. సెలబ్రిటీ కపుల్ కాబట్టి జాతీయ స్థాయిలో ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది.
చై-సామ్ విడాకుల వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. వీరు విడిపోవడంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తుంటే.. సినీ ప్రముఖులు శ్రేయోభిలాషులు మనో ధైర్యంతో ముందుకు వెళ్ళమని పోస్టులు పెడుతున్నారు. నాగచైతన్య - సమంత విడిపోవడం దురదృష్టకరం అని అన్నారు అక్కినేని నాగార్జున. భార్యభర్తల మధ్య జరిగినది వారి పర్సనల్ అని.. చై సామ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఇద్దరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని నాగ్ పేర్కొన్నారు.
రామ్ గోపాల్ వర్మ - కుష్బూ వంటి వారు కూడా నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం పై స్పందించారు. అయితే సోషల్ మీడియాలో చై-సామ్ బంధం గురించి రకరకాల వార్తలు వస్తున్న సమయంలో హీరో 'బొమ్మరిల్లు' సిద్దార్థ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. స్కూల్ లో టీచర్ నుండి నేను నేర్చుకున్న మొదటి పాఠాలలో ఒకటి ఇదంటూ సిద్దార్థ్.. ''మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'' అని కోట్ చేశారు. మరీ మీరు ఏమి నేర్చుకున్నారు? అని ప్రశ్నించాడు. సిద్ధార్థ్ ఎవరిని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ పెట్టాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశానికి.. సిద్దార్థ్ ట్వీట్ ని లింక్ చేస్తూ డీ కోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.