• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : కొడుకు తో...

పిక్ టాక్ : కొడుకు తో శ్యామ్‌ సింగరాయ్ అల్లరి ఫోజ్‌

By - Tupaki Desk
Update: 2022-05-04 03:30 GMT
కరోనా సమయంలో 'వి' మరియు 'టక్ జగదీష్‌' సినిమాలతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని తాజాగా శ్యామ్‌ సింగరాయ్ తో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసిన విషయం తెల్సిందే. శ్యామ్‌ సింగ రాయ్ లో నాని ద్వి పాత్రాభినయం చేసి సూపర్‌ హిట్ టాక్‌ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా లో నాని నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సక్సెస్ జోష్ లో ఉన్న నాని రెగ్యులర్ గా తన కొడుకు జున్ను ఫోటోలను షేర్‌ చేస్తూ తండ్రిగా తాను అనుభవిస్తున్న ఆనందంను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా జున్ను తో సరదాగా చిల్ అవుతూ అల్లరి చేస్తూ ఉన్న ఫోటోను నాని షేర్‌ చేశాడు. జున్ను మరియు నాని ఫోటోలు ఎప్పుడు సోషల్‌ మీడియాలో వచ్చినా కూడా అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి.

తాజాగా నాని షేర్‌ చేసిన ఈ ఫోటోను చూసిన అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వావ్‌ క్యూట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జున్ను చూస్తుండగానే పెద్ద వాడు అవుతున్నాడు.. త్వరలోనే జున్ను కూడా వెండి తెరపై కనిపిస్తాడేమో అంటూ కామెంట్స్ చేసే వారు కూడా లేకపోలేదు. నాని నట వారసుడిగా జున్ను వెండి తెరపై అరంగేట్రం చేయాల్సిందే అన్నట్లుగా అభిమానులు పట్టుదలతో ఉన్నారు.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే అంటే సుందరానికి సినిమా తో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఈ సమ్మర్ లోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇదే ఏడాది నాని నటిస్తున్న మరో సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాని ప్రస్తుతం జుట్టు పొడవుగా పెంచుకుని, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. అది దసరా సినిమా కోసం అనే విషయం తెల్సిందే. జున్నుతో ఈ అల్లరి పోటోలో కూడా నాని జుట్టు మరియు గడ్డం తో కనిపిస్తున్నాడు. అంటే సుందరానికి మరియు దసరా సినిమాలతో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ నాని సక్సెస్ లు దక్కించుకుంటాడేమో చూడాలి.
Tags:    
  • Nani 
  • Ante Sundaraniki 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS