నగ్నంగా నటించు.. లేదంటే రూ. 5లక్షలు కట్టు..!
సినీ రంగంలో వేధింపులు మహిళలకే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత ఆడవాళ్లు సినీ రంగంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులపై గళం విప్పారు. వీరికి న్యాయం జరిగిందా.. లేదా.. అన్నది పక్కన పెడితే మీటూ తర్వాత మహిళల్లో కొంతమేర చైతన్యం వచ్చినట్లే కన్పిస్తోంది.
మీటూ ట్రెండ్ మొదలైన కొత్తలో పలువురు స్టార్ హీరోయిన్లు, సీనియర్ నటీమణులు ఇండస్ట్రీలోని కౌస్టింగ్ కౌచ్.. కమ్మిట్మెంట్లపై గట్టిగానే మాట్లాడారు. దీంతో ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలు వెలుగు చూశాయి. దీనిపై మహిళలే ఎక్కువగా గళం విప్పడంతో వారికే వేధింపులుంటాయని జనాలంతా ఫిక్స్ అయిపోయారు.
అయితే ఇందుకు భిన్నంగా ఓ దర్శకురాలి చేతిలో ఓ బుల్లితెర నటుడు లైంగిక వేధింపులకు గురికావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఓ బుల్లితెర నటుడు సినిమాల్లో రాణించాలని కలలు కన్నాడు. ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టగా ఓ మూవీలో నటించే ఛాన్స్ దక్కింది.
ఇక్కడే ఆ కుర్రాడు తొందరపడ్డాడు. సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పూర్తిగా చదవకుండానే సంతకం చేశాడు. తీరా షూటింగ్ మొదలయ్యాక ఆ డైరెక్టర్ నగ్నం నటించాలని సూచించారట. దీంతో ఖంగు తినడం సదరు నటుడి వంతైంది. తాము తీసే సినిమా పూర్తిగా అడల్ట్ కంటెంట్ అని చెప్పడంతో తాను నటించేది లేదని తెగేసి చెప్పాడట.
సదరు డైరెక్టర్ మాత్రం అగ్రిమెంట్ జరిగిపోయిందని.. ఇప్పుడు నటించనంటే ఐదు లక్షలు కట్టాల్సిందేనని బెదిరించారట. ఆ మూవీ షూటింగ్ ఓ మారుమూల ప్రాంతంలో ఉండటంతో ఎటూ తప్పించుకోలేక పోయినట్లు ఆ నటుడు వాపోయాడు. ఇక చేసేదేమీ లేక ఆ డైరెక్టర్ చెప్పినట్లుగా మూవీలో నటించాడు.
ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజు కానుందట. ఈ మూవీ రిలీజైతే తన తల్లిదండ్రులు, బంధువులకు మొఖం చూపించుకోలేనని.. తనకు చావే శరణ్యమని వాపోతున్నాడు. సన్నిహితుల సలహా మేరకు ఆ బుల్లితెర నటుడు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసుల విచారణ సైతం చేపట్టారు.
దీని వెనుక ఉన్నది మాత్రం ఓ మహిళా దర్శకురాలు అని తేలడంతో పోలీసులు ఆమెను స్టేషన్ పిలిపించి గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపడుతున్నారు. దీంతో ఆ కుర్రాడు నటించిన సినిమా ఓటీటీలో విడుదల అవుతుందా? లేదా అన్న చర్చ మలయాళ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. ఇకపోతే గతంలోనూ రణ్ వీర్ సింగ్ కూడా ఇలాంటి అనుభమే ఎదురైనట్లు పలు సందర్భాల్లో వెల్లడించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.