'ఆచార్య' రెడ్డి మరో ప్రాజెక్ట్‌

Update: 2020-12-11 08:31 GMT
మెగా స్టార్‌ చిరంజీవి.. కొరటాల కాంబోలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాను మ్యాట్నీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ లో నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నా కూడా ఆచార్య నిర్మాణ వ్యవహారాలు కూడా పూర్తిగా నిరంజన్‌ రెడ్డి చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాత మరో సినిమాను కూడా నిర్మించేందుకు సిద్దం అయ్యారు. ఒక వైపు పెద్ద సినిమాలను నిర్మిస్తూనే మరో వైపు చిన్న సినిమాలను కూడా నిర్మించడం ఈమద్య బడా నిర్మాతలకు అలవాటుగా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్ని కూడా సూపర్‌ స్టార్‌ లతో సినిమాలను నిర్మిస్తూనే చిన్న స్టార్స్‌ తో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.

ఆహా ఓటీటీలో విడుదల అయిన జోహార్‌ మూవీకి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న తేజ మర్ని దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా అమృత అయ్యర్‌ హీరోయిన్‌ గా నిరంజన్‌ రెడ్డి ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. భారీ అంచనాలున్న ఆచార్య సినిమాను ఒక వైపు నిర్మిస్తూ మరో వైపు ఇలా చిన్న సినిమాలను నిర్మించడం అనేది ఇండస్ట్రీకి శుభ పరిణామం అన్నట్లుగా విశ్లేషకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News