‘మారేడుమిల్లి’ దళంలో చిరు-చెర్రీ!
మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రను తెరకెక్కించేందుకు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవులకు వెళ్లబోతోందట చిత్ర యూనిట్. చిరుతోపాటు చెర్రీ కూడా ఈ షెడ్యూల్ కు హాజరవుతారని సమాచారం.
దర్శకుడు కొరటాల శివ మారేడు మిల్లి అడవుల్లో చిరు - చరణ్ మధ్య కీలకమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూవీలో మెగా ద్వయం నక్సలైట్లుగా కనిపిస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పార్ట్ కు సంబంధించిన షూట్ ను మారేడు మిల్లి ఫారెస్ట్ లో షూట్ చేసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఆచార్య లో రామ్ చరణ్ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్రతోనే సినిమా కథ మొత్తం మారిపోతుందని సమాచారం. అక్కడ్నుంచే ఆచార్య కథను మరో రసవత్తరమైన యాంగిల్ లోకి మార్చబోతున్నాడట దర్శకుడు కొరటాల.
ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ.. చరణ్ హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే.. కరోనా పాజిటివ్ కారణంగా చెర్రీ హోం క్వారెంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకుతున్న తర్వాత ఈ నెలాఖరులోపు మారేడు మిల్లి వెళ్తారని తెలుస్తోంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
కాగా.. హీరో అల్లు అర్జున్ వారికంటే ముందే మారేడు మిల్లి అడవులకు వెళ్లబోతున్నాడు. జనవరి 8 న ప్రారంభం కాబోతున్న నెక్స్ట్ షెడ్యూల్ కోసం ‘పుష్ప’ బృందం మారేడుమిల్లి బయలుదేరనుంది.