ఛత్రపతి పై కన్నేసిన బాలీవుడ్ హీరో

Update: 2018-09-02 08:18 GMT
మన తెలుగు ఫిలిం మేకర్స్ కి ఒక్కసారి గట్టిగా జై కొట్టాలని ఉంది.  ఎందుకంటే.. తెలుగు కరెక్ట్ గా కొన్నేళ్ళ క్రితం తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులే చులకన చేసేవాళ్ళు. ఇక కొంతమంది తెలుగు వీరాభిమానులు కేవీరెడ్డి జమానానుండి విశ్వనాథ్.. బాపు వరకూ ఇప్పటి క్రిష్ జమానా వరకూ కొంతమంది మంచి అభిరుచి కలిగిన డైరెక్టర్ల సినిమాల పేర్లు చెప్పి తెలుగు సినిమా గొప్పే అని వాదించాల్సి వచ్చేది.  ఇప్పుడు ఆ అవసరం దాదాపుగా లేదు.  బాహుబలి దెబ్బకు టాలీవుడ్ పేరు అంతటా మార్మోగిపోయింది. ఇక ఘాజీ ..అర్జున్ రెడ్డి.. గూఢచారి లాంటి  చాలా సినిమాల దెబ్బకు అందరూ ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు..  అందుకే మన మేకర్స్ కు జై.

ఇదిలా ఉంటే ఎప్పటినుండో మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లోకి  రీమేక్ అవుతూ ఉన్నాయి..  ఇప్పుడు కూడా సెట్స్ పై పలు రీమేక్ సినిమాలున్నాయి.  అలా ఒక బాలీవుడ్ హీరోకు ఒక తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా పై కన్నుపడింది.  తనకు గనక అవకాశం వస్తే ప్రభాస్ - రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 'ఛత్రపతి' రీమేక్ లో లో నటించాలని ఉందని మనసులో మాటను బయట పెట్టాడు.  ఆ హీరో ఎవరో కాదు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడు స్మాల్ బీ అభిషేక్ బచ్చన్.  

అభిషేక్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ "నేను రెగ్యులర్ గా తెలుగు సినిమాలు చూస్తుంటాను. నాకు ప్రభాస్ 'ఛత్రపతి' సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్లూ సమపాళ్లలో ఉంటాయి. నాకు కనుక అవకాశం వస్తే 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో నటించాలని ఉంది." అన్నాడు.  'ఛత్రపతి' సినిమా ఎవరికి నచ్చకుండా ఉంటుంది? ఇక స్మాల్ బీ తన మనసులో మాట బయటపెట్టాడు కాబట్టి ఆయనను ప్రభాస్ లా గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగే దర్శక ధీరులు తమ లక్కు ను ట్రై చేసుకోవచ్చు. అల్ ది బెస్ట్!
Tags:    

Similar News