ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ‌ర్త్ డే గిఫ్ట్ రెడీ!

పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ `పుష్న 2` త‌రువాత మూడ‌వ భాగంగా `పుష్ప ది ర్యాంపేజ్‌`ని చేయ‌నున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-03-10 10:31 GMT

పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ `పుష్న 2` త‌రువాత మూడ‌వ భాగంగా `పుష్ప ది ర్యాంపేజ్‌`ని చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే దానికి ముందు బ‌న్నీ సినిమాల ప‌రంగా వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో ర్యాంపేజ్ చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాడు. వ‌రుస‌గా పాన్ ఇండియా రేంజ్‌కి ఏమాత్రం త‌గ్గ‌కుండా అంత‌కు మించి అన్న‌ట్టుగా సినిమాలు ప్లాన్ చేస్తుకుంటూ వ‌స్తున్నాడు. `పుష్ప 2` త‌రువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ డైరెక్ష‌న్‌లో భారీ పాన్ వ‌రల్డ్ మూవీకి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే.

కోలీవుడ్ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ‌గా పేరున్న స‌న్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ని అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. బ‌న్నీ సూప‌ర్ హీరో త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్‌లో క‌నిపించ‌నున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకోన్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌న క్యారెక్ట‌ర్ కూడా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని, ఓ వారియ‌ర్‌గా త‌న క్యారెక్ట‌ర్‌ని అట్లీ డిజైన్ చేశాడు. ఇప్ప‌టికే ఆమెపై ప‌లు కీల‌క పోరాట ఘ‌ట్టాల్ని షూట్ చేసిన అట్లీ ..బ‌న్నీపై మ‌రిన్ని ప్ర‌ధాన సీన్‌ల‌ని రూపొందిస్తున్నారు.

మృణాల్ ఠాకూర్‌, ర‌ష్మిక మందన్న కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇంత వ‌ర‌కు అఫీషియ‌ల్‌గా వీరి పేర్ల‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ ఈ వార్త‌ల‌ని మాత్రం ఖండించ‌క‌పోవ‌డం తెలిసిందే. ఇటీవ‌ల శిరీష్ వివాహం కార‌ణంగా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన అట్లీ మళ్లీ షూట్‌ని స్టార్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే వీఎఫ్ ఎక్స్‌కు అత్యంత ప్ర‌ధాన్యం ఉన్న ఈ మూవీకి సంబంధించిన తాజాగా ఓ కీల‌క అప్ డేట్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత వ‌ర‌కు ఈ మూవీ టైటిల్‌తో పాటు బ‌న్నీ క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్‌ని కూడా రివీల్ చేయ‌ని మేక‌ర్స్ ఇందు కోసం భారీ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలిసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని అట్లీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొద‌లు పెట్టిన అట్లీ గ్లింప్స్‌ని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చేత రిలీజ్ చేయించ‌బోతున్నాడ‌ట‌. అయితే షారుక్ నేరుగా పాల్గొన‌కుండా వ‌ర్చువ‌ల్‌గా పాల్గొని ఈ మూవీ గ్లింప్స్‌ని రిలీజ్ చేయ‌బోతున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. షారుక్ ఖాన్ తో అట్లీ `జ‌వాన్‌`ని రూపొందించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి బాండ్ ఏర్ప‌డింది.

ఆ బాండ్ కార‌ణంగానే షారుక్ ఖాన్ చేత ఐకార్ స్టార్ మూవీ గ్లింప్స్‌ని రిలీజ్ చేయాల‌ని, బ‌ర్త్‌డే గిఫ్ట్‌ని అందించాల‌ని ద‌ర్శ‌కుడు అట్లీ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఏప్రిల్ 8న బ‌న్నీ బ‌ర్త్‌డే. అయితే ఒక్క రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 7న బ‌ర్త్ డే గిఫ్ట్‌ని అట్లీ ప్లాన్ చేశాడ‌ట‌. ఏప్రిల్ ఉద‌యం 11:59నిమిషాల‌కు AA22 ఫ‌స్ట్ లుక్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీ గ్లింప్స్‌తో భారీ స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్‌గా హంగామా చేయ‌బోతున్నార‌ట‌.

Tags:    

Similar News