'దేవర 2'కు ఫైనల్‌గా ముహూర్తం పెట్టేశారా?
జాన్వీకపూర్ నుంచి క్రేజీ నటీనటులు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.500 కోట్లు రాబట్టింది.;
మాస్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్ డ్రామా `దేవర`. కొరటాల శివ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ మూవీ 2024లో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో మాత్రం ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించలేకపోయింది. `ఆర్ఆర్ఆర్` ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాల్ని అందుకోవడంలో మాత్రం దేవర విఫలమైంది. స్టోరీ డ్రైవ్ విషయంలోనూ, కంటెంట్ విషయంలోనూ రాణించలేక తీవ్ర నిరాశకు గురి చేసింది.
జాన్వీకపూర్ నుంచి క్రేజీ నటీనటులు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.500 కోట్లు రాబట్టింది. రిలీజ్‌కు ముందే రెండు భాగాలుగా సినిమా ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో ఫస్ట్ పార్ట్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని సెకండ్ పార్ట్ సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు లేవని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై మేకర్స్, డైరెక్టర్ కూడా స్పందించకపోవడం, ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్ట్‌లలో బిజీ కావడంతో ఇక `దేవర 2` కష్టమనే సంకేతాలు వినిపించాయి. అయితే తాజాగా `దేవర 2` రూమర్‌లపై నిర్మాత సుధాకర్ మిక్కిలినేని క్లారిటీ ఇవ్వడం, ఈ ప్రాజెక్ట్ ఉంటుందని స్పష్టం చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
లేదు అన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలియడంతో మరో పాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట. షూటింగ్ షెడ్యూల్‌ని కూడా ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. `దేవర 2` రెగ్యులర్ షూటింగ్‌ని మే నుంచి మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. ఇక కథలో భారీ మార్పులు చేయడం వల్లే ఈ ప్రాజెక్ట్ లేట్ అయిందని, ఎన్టీఆర్ ఇందులో చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న `డ్రాగన్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా ఎన్టీఆర్ చేసిన `వార్ 2` డిజాస్టర్ అనిపించుకోవడంతో `డ్రాగన్`తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని పాన్ ఇండియా వైడ్‌గా రీసౌండ్ చేయాలనే పట్టుదలతో ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే ఈ ప్రాజెక్ట్‌ని చాలా ప్రత్యేకంగా భావిస్తున్నారట. తక్కువ బ్రేక్స్ తీసుకుంటూ సినిమాని ఫాస్ట్‌గా పూర్తి చేస్తున్నారని తెలిసింది.
ఇదిలా ఉంటే `డ్రాగన్` మూవీని `కేజీఎఫ్`, సలార్ చిత్రాల తరహాలో రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడని, ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయిందని, ఇదే ఊపులో సెరండ్ పార్ట్‌ని కూడా సైలెంట్‌గా లాగించేస్తున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. లార్జర్ దెన్ లైఫ్ స్కేల్‌లో రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్, క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన తీరు సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్.