సిగ్గు కాదు గర్వపడుతున్నా అన్న జూనియర్

Update: 2018-04-18 23:30 GMT
జూనియర్ అనగానే.. మన దగ్గర జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చేస్తాడు. కానీ దేశవ్యాప్తంగా అయితే ఈ పేరుతో బాగా ఫేమస్ అయిన హీరో అభిషేక్ బచ్చన్. అమితాబ్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్ ను.. ఇప్పటికీ జూనియర్ బచ్చన్ అనే అంటారు. అంతెందుకు.. తన ట్విట్టర్ హ్యాండిల్ కు కూడా ఈ హీరో @juniorbachchan అనే పేరు పెట్టుకోవడం విశేషమే.

అయితే ఇలా ఇంత కాలం గడిచినా కూడా.. ఇంకా జూనియర్ అనిపించుకోవడం.. పైగా అమ్మా నాన్నలతో కలిసే ఉండడం అనే పాయింట్.. ఓ ట్విట్టర్ ఫాలోయర్ కి నచ్చలేదు. అందుకే అదే విషయాన్ని జూ. బచ్చన్ ను కాస్త ఘాటుగా అడిగాడు. 'నీ జీవితం గురించి నీకు బ్యాడ్ అనిపించదా.. ఇంకా మీ పేరెంట్స్ తోనే కలిసి ఉంటున్నావు' అంటూ అభిషేక్ బచ్చన్ ను కోట్ చేస్తూ.. ట్వీట్ చేశాడు ఓ వ్యక్తి. ఇలాంటివి సహజంగా హీరోలు పట్టించుకోరు కానీ.. అభిషేక్ బచ్చన్ మాత్రం ఓ చక్కని ఆన్సర్ తో రిప్లై ఇచ్చాడు. జూనియర్ ఇచ్చిన రిప్లైకు వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయిందంటే.. అందులో ఎంత పవర్ ఉందో అర్ధం అవుతుంది.

ఇంతకీ అభిషేక్ ఏమని రిప్లై ఇచ్చాడో తెలుసా.. "అవును.. వాళ్లతో ఉండడం అంటే నేను ఎంతో గర్వపడే విషయం. వారు నాకోసం ఉన్నారనే విశ్వాసం అది. ఒక సారి నువ్వు కూడా అది ప్రయత్నించి చూడు.. అపుడు నీ గురించి నీవు మరింత ఉత్తమంగా భావించే అవకాశం వస్తుంది" అని చెప్పాడు అభిషేక్.
Tags:    

Similar News