మీకెప్పటికీ రుణపడి ఉంటాను: అభిషేక్ బచ్చన్
సినీ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కరోనా వచ్చింది అనగానే దేశవ్యాప్తంగా అభిమానులు షాకయ్యారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో అభిమాన నటులు అమితాబ్.. ఐశ్వర్య.. అభిషేక్ లతో పాటు వారి కూతురు ఆధ్య కూడా ఉంది. వీరంతా కరోనా పేషెంట్స్ అనగానే అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేక పోయారు. వెంటనే తమ అభిమాన తారలకు ఏమి కాకూడదని అభిమానులంతా ఇష్టదైవాలను ప్రార్థించడం మొదలుపెట్టారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగానే వీరి నలుగురికి పాజిటివ్ వచ్చి.. మిగతా జయా బచ్చన్, శ్వేత ఆమె పిల్లలకు నెగటివ్ వచ్చింది.
అప్పుడే అమితాబ్ అభిషేక్ వెంటనే దగ్గరలోని నానావతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అమితాబ్, అభిషేక్ లకు ఎలాంటి ప్రమాదం లేదని ఇదివరకే డాక్టర్లు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ వార్త తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా అభిషేక్ ఆసుపత్రిలో నడిచాడట. తను నడిచినట్లుగా ఇంస్టాగ్రామ్ లో హాస్పిటల్ కారిడార్ పిక్ పోస్ట్ చేసాడు. ఆ ఫోటోకి 'లేట్ నైట్ వాక్స్' అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించాడు. ఇదివరకే అమితాబ్ అభిషేక్ లకు పూర్తి కరోనా వైద్యం అవసరం లేదని సిబ్బంది తెలిపింది. ఎందుకంటే వారిలో కరోనా ప్రమాదకర స్థాయిలో లేదట. తక్కువ డోస్ మందులతో కేవలం అబ్సర్వేషన్ సరిపోతుందని చెప్పారు.
అంతేగాక వీరికి ఒక వారంలో మళ్లీ కరోనా టెస్ట్ చేస్తామని అప్పటి రిజల్ట్స్ బట్టి వైద్యంలో మార్పులు చేస్తామని.. పాజిటివ్ ఉంటే డోస్ పెంచుతాం. లేదంటే ఇలాగే మరో వారం అబ్జర్వేషన్ లో ఉంచుతామని అన్నారు. అందుకే ఇప్పుడు అమితాబ్, అభిషేక్ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇక ఐశ్వర్యరాయ్, ఆధ్యలు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. వారు ఇంటివద్దే జాగ్రతలు తీసుకుంటూ మందులు వేసుకుంటున్నారట. ఈ సందర్భంగా అభిషేక్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మీ నిస్వార్ధమైన ప్రార్థనలకు.. విషెస్ కి ధన్యవాదాలు. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. ఐశ్వర్య, ఆరాధ్య ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. నేను నాన్న వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాం" అని పేర్కొన్నాడు.