• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  '3 రోజెస్' టీజర్: ఫన్...

'3 రోజెస్' టీజర్: ఫన్ అండ్ బోల్డ్

By - Tupaki Desk
Update: 2021-11-06 13:30 GMT
100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందించడానికి కృషి చేస్తోన్న ఓటీటీ 'ఆహా'. బ్లాక్ బస్టర్ సినిమాలు - స్పెషల్ టాక్ షోలతో పాటుగా ఒరిజినల్ సిరీస్ లనూ స్ట్రీమింగ్ పెడుతోంది. ఇప్పుడు ''3 రోజెస్'' అనే సరికొత్త వెబ్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

''3 రోజెస్'' ఒరిజినల్ షోతో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి డిజిటల్ వరల్డ్ లో అడుగుపెడుతున్నారు. ఈ సిరీస్ కు మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్ - ఈషా రెబ్బా - పూర్ణ వంటి ముగ్గురు ముద్దుగుమ్మలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు డిజిటల్ స్పేస్ లో ముగ్గురు హీరోయిన్స్ తో చేస్తున్న తొలి ఫీమేల్ సెంట్రిక్ ఒరిజినల్ సిరీస్ ఇదేనని తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన '3 రోజెస్' ఫస్ట్ లుక్ మరియు ముగ్గురు హీరోయిన్ల క్యారక్టర్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. నవంబర్ 12న ఈ సిరీస్ ని ఆహా లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ ని పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రీతూ - జాన్వీ - ఇందు అనే ముగ్గురు స్వతంత్ర భావాలు కలిగిన ఈ జనరేషన్ అమ్మాయిల జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని రూపొందించారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

'3 రోజెస్' సిరీస్ ఓటీటీ కంటెంట్ కావడంతో అడల్ట్ టచ్ తో పాటుగా కాస్త శృతి మించిన డైలాగ్స్ కి అవకాశం కల్పించారు. ముగ్గురు బ్యూటీస్ గ్లామర్ డోస్ పెంచి కనువిందు చేస్తున్నారు. ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఫన్ అండ్ బోల్డ్‌ అంశాలతో నేటితరం యువతను టార్గెట్ చేస్తూ ఈ సిరీస్ ని రూపొందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇందులో ఇషాన్ - ప్రిన్స్ - సంగీత్ శోభన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - హేమ - గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

రవి నంబూరి ఈ సిరీస్ కు కథ అందించగా.. మ్యాగీ దర్శకత్వం వహించారు. సన్నీ ఎమ్.ఆర్ సంగీతం సమకూర్చారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. ఎస్బీ ఉద్ధవ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్పి బ్యానర్ పై SKN ఈ ఒరిజినల్ సిరీస్ ను నిర్మించారు. వచ్చే వారం నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్న ముగ్గురు భామల '3 రోజెస్' ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.



Full View




Tags:    
  • 3 Roses Trailer 
  • 3 Roses 
  • Trailer 
  • aha 
  • aha2.0 
  • Payal Rajput 
  • Isha Rebba 
  • Poorna 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS