2021 సీజ‌న్ తాప్సీకి బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది!

Update: 2021-06-13 03:30 GMT
కోవిడ్ సెకండ్ వేవ్ ఫిలింమేక‌ర్స్ ని వ‌దిలి పెట్ట‌కుండా వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా తాప్సీకి ఇది బ్యాడ్ సీజ‌న్. ఈ బ్యూటీ న‌టించిన‌ హసీన్ దిల్ రూబా తరువాత రష్మి రాకెట్ కూడా డిజిటల్ లోనే రిలీజ్ కానుందా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తాప్సీ ఓవైపు వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. మహమ్మారి కారణంగా రిలీజ్ కి రెడీగా ఉన్న వ‌రుస చిత్రాల‌ విడుదల ఆలస్యం అయింది. ఈ నెల ఆరంభంలో మహమ్మారి అనంత‌రం హ‌సీనా దిల్ రుబా డిజిటల్ ప్రీమియర్ ఉంటుందని వెల్లడించారు. తాప్సీ- విక్రాంత్ మాస్సే- హర్షవర్ధన్ రాణే నటించిన హసీన్ దిల్ రూబా జూలై 2 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు..  వినీల్ మాథ్యూ తెర‌కెక్కించిన‌ హసీన్ దిల్ రూబా విడుదలకు ముందే తాప్సీ న‌టించ‌న‌ క్రీడా నేప‌థ్య చిత్రం రష్మి రాకెట్ కూడా డిజిటల్ మార్గంలో పయనిస్తుంది. స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోతో నిర్మాతలు రోనీ స్క్రూవాలా- నేహా ఆనంద్- డిజిట‌ల్ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించిన ఈ మూవీని సెప్టెంబర్  లో విడుదల చేయ‌నున్నారు.

అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీలలో గెలవాలని కోరుకునే గుజరాతీ స్ప్రింటర్ పాత్రను తాప్సీ పోషించింది  అథ్లెట్ గా మెప్పించేందుకు తాప్సీ విస్తృతమైన శారీరక శిక్షణ పొందింది. ఈ చిత్రంలో ప్రియాన్షు పెన్యూలీ- అభిషేక్ బెనర్జీ- సుప్రియా పాథక్ కూడా నటించారు.
Tags:    

Similar News