• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2 కోట్ల ఇంట్లో ఎన్టీవోడు

2 కోట్ల ఇంట్లో ఎన్టీవోడు

By - Tupaki Desk
Update: 2016-04-21 14:01 GMT
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. మిర్చి.. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు.. ‘శ్రీమంతుడు’తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాతలు.. మోహన్ లాల్-సమంత-నిత్యామీనన్ లాంటి క్రేజీ ఆర్టిస్టులు.. దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా మాంచి కాంబినేషన్ కుదిరింది ఈ సినిమాకు. అందుకే సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే దీనికి అదిరిపోయే బిజినెస్ ఆఫర్లు వచ్చాయి. ఎన్టీఆర్ గత రెండు సినిమాలూ విజయవంతం కావడం కూడా ‘జనతా గ్యారేజ్’ మీద అంచనాల్ని మరింత పెంచాయి. ఈ అంచనాల్ని అందుకునే విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ కొరటాల శివ.

ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇటీవలే రూ.2 కోట్ల ఖర్చుతో మండువా ఇంటి సెట్ వేశారట. ఇది టాలీవుడ్లో అత్యంత రిచ్ ఇంటి సెట్టింగ్స్ లో ఒకటని చెబుతున్నారు. ఆర్ట్ డైరెక్టర్ బృందం చాలా రోజులు శ్రమించి.. ఈ భారీ ఇంటి సెట్ నిర్మించారట. ఈ ఇంట్లో సినిమాకు సంబంధించిన కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. సినిమాకు ఈ ఇంటి సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇంతకుముందు ఈ సినిమా కోసం భారీ గ్యారేజ్ సెట్టింగ్ కూడా వేశారు. అందులోనూ చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు మండువా ఇంట్లో షూటింగ్ జరుగుతోంది. ఇంకో రెండు నెలల్లో టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోతుందని సమాచారం. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Tags:    
  • NTR 
  • Mohan lal 
  • Janata Garage 
  • Telugu NEws 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS