• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైల‌ర్ టాక్ :...

ట్రైల‌ర్ టాక్ : పీరియాడిక్ సినిమా లెక్క పీరియాడిక్ పోరీ

By - Tupaki Desk
Update: 2022-12-17 13:05 GMT
`కార్తికేయ 2` వంటి పాన్‌ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ల కాంబినేష‌న్ లో వ‌స్తున్న రొమాంటిక్ యాక్ష‌న్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ `18 పేజెస్‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ మూవీకి ఆయ‌న శిష్యుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జీఎ2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ వ్రైటింగ్స్ బ్యాన‌ర్ ల‌పై బ‌న్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 23న భారీ స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయ‌బోతున్నారు.

రీసెంట్ గా ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియెని, హుక్‌స్టెప్ ప్రోమోని విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాల్ని పెంచేసిన మేక‌ర్స్ అన్న‌ట్టుగానే శని వారం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. ఫేస్‌ బుక్ లో అకౌంట్ లేని ఓ అమ్మాయి డైరీని ఫాలోఅవుతూ త‌న ప్రేమ‌లో ప‌డే ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. `నీకు ఫేస్ బుక్ లేదా.. లేదూ..వుంటే ఫొటోస్ తీసి పెట్టుకోవ‌చ్చు క‌దా.. పెట్టుకుంటే..బోల్డ‌న్ని లైక్ లొస్తాయ్‌.. అంటూ  హీరో, హీరోయిన్ ల స‌ర‌దా సంభాష‌ణ నేప‌థ్యంలో ట్రైల‌ర్ మొద‌లైంది.

పీరియాడిక్ సినిమాలెక్క పీరియాడిక్ పోరి ఏడీ 1990.. లాంటి ఓ అమ్మాయి చుట్టూ సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థా ఈ సినిమా వుంటుంద‌ని డైలాగ్ ల‌ని బ‌ట్టి తెలుస్తోంది. ఇంత‌కీ ఆ అమ్మాయి ఎవ‌రు?.. ఎక్క‌డుంది?.. ఇంత‌కీ త‌న క‌థేంటీ?.. త‌న డైరీ హీరో చేతిలోకి ఎలా వ‌చ్చింది?.. త‌న డైరీ హీరోకి ఎలాంటి ప‌రిస్థితుల్లో ల‌భించింది?.. ఇంత‌కీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వారెవ‌రు?.. త‌న‌ని హీరో క‌లుసుకున్నాడా?.. చివ‌రికి ఈ క‌నిపించ‌ని క‌ల‌ల రాణి కోసం హీరో ఏం చేశాడు?.. త‌న‌ని చివ‌రికి చేరుకున్నాడా? ఇద్ద‌రు క‌లిశారా? అన్న‌దే ఇందులో ఆస‌క్తిక‌రం.

ఓ అమ్మాయి డైరీని ఫాలో అయ్యే హీరో క‌థ‌గా స‌రి కొత్త నేప‌థ్యంలో ఈ మూవీని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. ట్రైల‌ర్ లోని విజువ‌ల్స్‌, హీరో, హీరో హీరోయిన్ ల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్రేమ క‌థ‌ల్లో స‌రికొత్త క‌థ‌గా ఈ సినిమా వుంటుంద‌నే ఫీల్ ని ట్రైల‌ర్ తో మేక‌ర్స్ క‌లిగించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌గా సాగ‌నున్న ఈ మూవీకి గోపీ సుంద‌ర్ సంగీతం, ఏ వ‌సంత్ సినిమాటోగ్ర‌ఫీ, న‌వీన్ నూలి ఎడిటింగ్‌ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View
Tags:    
  • 18Pages 
  • movie 
  • TheatricalTrailer 
  • Nikhil 
  • Anupama 
  • latestnews 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS