హీరోయిన్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌

నిశ్చితార్థం జరిగి నెలలు గడుస్తున్న నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ప్రకటన వచ్చింది.

Update: 2024-05-08 09:28 GMT

సౌత్‌ స్టార్‌ నటుడు, యాక్షన్ కింగ్‌ అర్జున్‌ నట వారసురాలు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్ గా పరిచయం అయ్యి పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఐశ్వర్య తెలుగు లో కూడా ఒక సినిమాను కమిట్ అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్‌ అయిన విషయం తెల్సిందే.

సినిమాల విషయం పక్కన పెడితే ప్రముఖ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతి తో ఐశ్వర్య అర్జున్‌ పెళ్లి నిశ్చితార్థం జరిగింది. అర్జున్‌ స్వయంగా కట్టించిన హనుమాన్‌ టెంపుల్‌ లో వీరి వివాహ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులు పలువురు హాజరు అయ్యారు.

నిశ్చితార్థం జరిగి నెలలు గడుస్తున్న నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ప్రకటన వచ్చింది. అర్జున్‌ ఫ్యాన్స్ తో పాటు మీడియా వర్గాల వారు ఐశ్వర్య అర్జున్ మరియు ఉమాపతి ల పెళ్లి వేడుక ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనే చర్చకు తెర లేపిన సమయంలో ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

జూన్‌ 10న వీరి వివాహంను నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు అయ్యాయి. మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో వధువరులు ఇద్దరు కూడా పెళ్లి షాపింగ్ కూడా మొదలు పెట్టి ఉంటారు అని తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.

Read more!

ఎక్కడ వీరి వివాహం జరుగుతుందా అంటూ ఎదురు చూస్తున్న వారికి అర్జున్‌ ఫ్యామిలీ నుంచి ఆసక్తికర సమాచారం అందుతోంది. అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ టెంపుల్‌ లో నిశ్చితార్థం జరుగగా, అదే టెంపుల్‌ లో వివాహం కూడా జరిపించాలని అర్జున్ మరియు తంబి రామయ్య లు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

అర్జున్‌ హోస్ట్‌ గా వ్యవహరించిన ఒక టీవీ కార్యక్రమంలో ఐశ్వర్య మరియు ఉమాపతి లు పరిచయం అయ్యారు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కూడా కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధం అయ్యారు. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఐశ్వర్య పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగించనున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News