• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుష్క హిట్.. నిర్మాతల...

అనుష్క హిట్.. నిర్మాతల వెనుకడుగు!

| ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనుష్క అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ప్రమోషన్స్ లో అస్సలు పాల్గొనలేదు.

By - Tupaki Desk
Update: 2023-09-12 07:21 GMT

దాదాపు ఐదేళ్లు గ్యాప్ తర్వాత రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో సీనియర్ హీరోయిన్ అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం మౌత్ టాక్ తో రోజురోజుకు రెస్పాన్స్ పెంచుకుంటూ ముందుకుపోతోంది. వసూళ్ల పరంగా యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ ను దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సేఫ్ జోన్ కు దగ్గరవుతోంది. కానీ ఈ విజయం అనుష్కకు అంతగా దోహదపడకపోవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళితే.. వాస్తవంగా అనుష్క లాంటి పెద్ద స్టార్ ఈ చిత్రంలో ఉన్నప్పటికీ.. సినిమా సక్సెస్ విషయంలో ఎక్కువ క్రెడిట్ హీరోగా నటించిన ననీన్ పోలిశెట్టికే ఇవ్వాలి. ఎందుకంటే ఖాళీ లేకుండా ఊరూరా తిరుగుతూ నిర్విరామంగా అతడు చేసిన ప్రమోషన్స్ ప్రయత్నాలే ఈ చిత్రానికి కాస్త బజ్ క్రియేట్ చేసి.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేశాయి. ఆ తర్వాతే కంటెంట్ పరంగా ఆదరణను దక్కించుకుంటోంది.

ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనుష్క అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ప్రమోషన్స్ లో అస్సలు పాల్గొనలేదు. కేవలం షూటింగ్ వరకే సినిమా కోసం పని చేసింది. అంతా నవీనే చూసుకున్నారు. అదే ఈ చిత్రం ఫ్లాప్ అయి ఉంటే మాత్రం.. అనుష్కపై తీవ్రంగా విమర్శలు వచ్చే అవకాశముండేది. ప్రమోషన్స్ కు ఆమె దూరంగా ఉండటం కూడా ఓ కారణమని బ్లేమ్ చేసేవారు. ఇతర నిర్మాతలు కూడా ఆమెతో సినిమా చేసేందుకు కాస్త ఆలోచించేవారు.

కానీ ఇప్పుడీ విజయంతో అనుష్కకు ఆ బాధ లేకుండా పోయింది. అలాగని ఈ విజయం ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందని చెప్పలేం. ఎందుకంటే నిర్మాతలు.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని, లుక్స్ విషయంలో ఓకే అనిపించే స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్లను మాత్రమే తీసుకోవాలని చూస్తున్నారు. అలానే తమ సినిమాను పబ్లిక్ లోకి తీసుకెళ్లేందుకు అన్ని విధాల సహకరించే వారి కోసమే చూస్తున్నారు. ఎందుకంటే ఈ సమస్యలు ఉంటే తమ ప్రాజెక్ట్ ఇబ్బందులను ఎదుర్కొంటాయన్న భయం కూడా వారిలో ఉంది.

అయితే ఐదేళ్ల తర్వాత అనుష్క మిస్ శెట్టితో చెప్పుకోదగ్గ సక్సెస్ ను అందుకుని, నిర్మాతలను సేఫ్ జోన్ లో ఉంచినప్పటికీ.. ఆమెకున్న వ్యక్తిగత కారణాలు, నిబంధనల వల్ల నిర్మాతలు ఎక్కువగా ఆమెతో సినిమా చేసేందుకు ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఇకపోతే ఆమె ప్రస్తుతం మలయాళంలో రెండు ప్రాజెక్ట్ లను ఒప్పుకుంది. ప్రస్తుతం అవి చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Tags:    
  • Anushkashetty 
  • Naveenpolishetty 
  • MissshettymrpolishettyMovie 
  • Moviepromotions 
  • Telugustates 

Similar News

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS