• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిస్ శెట్టి మిస్టర్...

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. మనసు మార్చుకున్న అనుష్క

| ఇప్పుడు తాజాగా రిలీజవుతున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్​లో ఎక్కడా కనపడట్లేదు

By - Tupaki Desk
Update: 2023-08-27 08:08 GMT

అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో హీరోయిక్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్​ అనుష్క... బాహుబలితో భారీ ఇమేజ్​ను దక్కించుకుంది. అయితే ఆ తర్వాత ఆమె చేసిన భాగమతి, నిశబ్దం ఘోరంగా డిజాస్టర్​ టాక్​ను అందుకున్నాయి. దీంతో భారీ గ్యాప్ ఇచ్చిన ఆమె దాదాపు ఐదేళ్ల తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విషయంలో ఆమె ఎట్టకేలకు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలసుస్తోంది.

అదేంటంటే.. అనుష్క మొదటి నుంచి తన సినిమాలకు బాగానే ప్రమోషన్స్​లో పాల్గొనేది. కానీ బాహుబలి తర్వాత అంతగా కనిపించడం మానేసింది. ముఖ్యంగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు తాజాగా రిలీజవుతున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్​లో ఎక్కడా కనపడట్లేదు. మూవీలో నటించిన హీరో నవీన్ పోలిశెట్టి మాత్రం రకరకాలుగా ప్రమోషన్స్​ చేస్తూ తిరుగుతున్నారు. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.

అయితే 'బాహుబలి' వరకు తన చిత్రాలను బాగానే ప్రమోట్ చేసిన అనుష్క.. ఆ తర్వాత తన ఫిజిక్​లో మార్పులు వచ్చాయని, అందుకే పబ్లిక్​ అప్పీయరెన్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతోందని అప్పట్లో గుసగుసలు కూడా వినిపించాయి. ఏదేమైనప్పటికీ అసలు కారణం తెలీదు కానీ ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చి చాలా కాలమైంది. దీంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్​లోనూ ఆమె పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది నిన్న మొన్నటివరకు అనుమానంగానే ఉంది.

కానీ ఇప్పుడు అనుష్క తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఓ వీడియో ఇంటర్వ్యూకు రెడీ అయిందని సమాచారం అందింది. ఇప్పటికే దాన్ని షూట్​ కూడా చేసేశారట. హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి యూంకర్ సుమకు ఈ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఇది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్​ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు మహేష్‌బాబు.పి దర్శకత్వం వహించారు. నవీన్‌ పొలిశెట్టి... సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలో, హీరోయిన్ అనుష్క... అన్విత రవళిశెట్టి అనే షెఫ్‌ పాత్రలోనూ నటించారు. ఈ చిత్రానికి రధన్‌ సంగీతం అందించారు. నీరవ్‌ షా ఛాయాగ్రహణం అందించారు.

Tags:    
  • Anushkashetty 
  • Tollywood 
  • Movienews 
  • MissshettymrpolishettyMovie 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS