స‌మంత‌, అనుష్క ప్ర‌యాణం ఒకేలా!

అనుష్క ఇమేజ్కి అవ‌కాశాలు రాక‌పోవ‌డం ఏంటి? అనుష్క సినిమాలు చేస్తాన నేలాగా నీ అడ్వాన్సులు ఇవ్వ‌డానికి నిర్మాత‌లు క్యూ క‌డ‌తారు.;

Update: 2025-06-29 20:30 GMT

`భాగ‌మ‌తి` త‌ర్వాత అనుష్క సినిమాల వేగం త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. `నిశ‌బ్దం`,` మిస్ పొలిశెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి`లో న‌టించింది. ఆ రెండు ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ప్ర‌స్తుతం ఘాటీలో న‌టిస్తోంది. మాలీవుడ్ లో `క‌త్నార్` సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. అనుష్క చేతిలో ఈ రెండు సినిమాలు మినిహా కొత్త ప్రాజెక్ట్ లు ఏవి లేవు. మ‌రి అనుష్క అవకాశాలు రాక చేయ‌లేదా? వ‌చ్చినా వ‌ద్ద‌నుకుంటుందా? అంటే అందులో రెండ‌వ‌దే ఖాయం చేసుకోవాలి.

అనుష్క ఇమేజ్కి అవ‌కాశాలు రాక‌పోవ‌డం ఏంటి? అనుష్క సినిమాలు చేస్తాన నేలాగా నీ అడ్వాన్సులు ఇవ్వ‌డానికి నిర్మాత‌లు క్యూ క‌డ‌తారు. అనుష్క కోసమే క‌థ‌లు ప‌ట్టుకుని దర్శ‌కులు సిద్దంగా ఉన్నారు. కానీ అనుష్క‌నే సిద్దంగా లేక బాగా న‌చ్చిన స్క్రిప్ట్ లు మిన‌హా చేయ‌డం లేదు. స‌రిగ్గా ఇదే ప‌రిస్థితుల్లో స‌మంత కూడా క‌నిపిస్తుంది. `ఖుషీ` త‌ర్వాత స‌మంత సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అమెరికా నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత నిర్మాత‌గా మారింది. ఇప్ప‌టికే `శుభం` అనే సినిమా కూడా రిలీజ్ చేసింది. అలాగే `మా ఇంటి బంగారం` అనే చిత్రం చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో స‌మంత ఏ కార‌ణంగా సినిమాలు చేయ‌లేదు? అన్న చ‌ర్చ మొద‌లైంది. అవ‌కాశాలు రాక చేయ‌డం లేదా? వ‌చ్చినా వ‌ద్ద‌నుకుంటుందా? అన్న డిస్క‌ష‌న్ మ‌ధ్య స‌మంత‌కు అవ‌కాశాలు రాక పోవ‌డం ఏంటి? కో అంటే కోటి మంది నిర్మాత‌లు ఆమెతో వ‌చ్చి సినిమా చేయ‌డానికి సిద్దంగా ఉన్నార‌న్న‌ది మెజార్టీ వ‌ర్గం మాట‌.

స‌మంత సీరియ‌స్ గా దృష్టి పెడితే అవ‌కాశాలు రాకుండా ఉంటాయా? అని అంటున్నారు. అనారోగ్య ప‌రంగా తాను ఎదుర్కున్న ప‌రిస్థితుల కార‌ణంగానే స‌మంత సినిమాల‌పై దృష్టి పెట్ట‌లేదు అన్న వాద‌నా తెర‌పైకి వ‌స్తోంది.

Tags:    

Similar News