అనుపమ 5 ఏళ్ల బ్రేక్‌కి కారణం ఇదేనట!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్‌ ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.;

Update: 2025-06-17 19:30 GMT
అనుపమ 5 ఏళ్ల బ్రేక్‌కి కారణం ఇదేనట!

మలయాళ మూవీ 'ప్రేమమ్‌'తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. తెలుగులో ఈ అమ్మడు అదే ప్రేమమ్‌ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతే కాకుండా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాలో కీలక పాత్రలో నటించి నటిగా, అందంతో మెప్పించింది. దాంతో అనుపమ తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది. టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్‌ మలయాళంలో మాత్రం సినిమాలు చేయలేదు. కరోనా సమయంలో ఈమె నటించిన మలయాళ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఈమె మలయాళ సినిమాలో నటించలేదు. ఎట్టకేలకు ఈమె జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్ కేరళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

లేడీ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపొందిన జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్ కేరళ సినిమాను వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ నటించిన మలయాళ సినిమా చాలా కాలం తర్వాత విడుదల కాబోతున్న నేపథ్యంలో కేరళలో అందరి దృష్టి ఆకర్షించింది. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీ చర్చకు తెర తీసింది. సుదీర్ఘ కాలం తర్వాత అనుపమ పరమేశ్వరన్‌ మలయాళ సినిమా చేసింది. అయితే ఈమె ఎందుకు ఇన్నాళ్లు గ్యాప్‌ ఇచ్చింది. ఈ గ్యాప్‌లో కేవలం తెలుగు, తమిళ సినిమాలు మాత్రమే ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్‌ ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

హీరోయిన్‌గా తాను మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో చాలా మంది విమర్శించారు. ముఖ్యంగా కొందరు తనను నటన రాదు, నటించి పరువు తీసుకోవడం అవసరమా అంటూ విమర్శలు చేశారు. అందుకే మంచి కథ కోసం ఎదురు చూశాను, నన్ను నేను నిరూపించుకోవడం కోసం మంచి కథతో మలయాళ ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకున్నాను. అందుకే ఇన్నాళ్లు బ్రేక్‌ వచ్చిందని చెప్పుకొచ్చింది. దర్శకుడు ప్రవీణ్‌ నారాయణ్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాతో రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాను. నన్ను నటన రాదు అంటూ విమర్శించిన వారు కచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత వారి అభిప్రాయం మార్చుకుంటారని అనుపమ చెప్పుకొచ్చింది.

సురేష్ గొప్ప ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో దివ్య పిల్లై మరో ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమా మలయాళంలో హిట్‌ అయితే తెలుగులో రీమేక్ చేయడం లేదంటే డబ్‌ చేయడం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ వెయిట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అనుపమ పరమేశ్వరన్‌ ప్రస్తుతం బైసన్‌ సినిమాతో పాటు తెలుగులో పరదా అనే సినిమాను చేస్తుంది. ఈ ఏడాది అనుపమ నటించిన, నటిస్తున్న సినిమాలు కనీసం నాలుగు అయిదు అయినా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రావడం కోసం మరో రెండు మూడు సినిమాలను ఇటీవలే అనుపమ కమిట్‌ అయిందని సమాచారం. త్వరలోనే కొత్త సినిమాల షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News