• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత మళ్ళీ బౌన్స్ బ్యాక్...

సమంత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలదా?

| అయినప్పటికీ ఓవరాల్ గా ఈ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్‌’ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయిందని, ఏమంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

By - Tupaki Desk
Update: 2024-11-19 10:30 GMT

అనారోగ్య సమస్యలతో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు మళ్ళీ బిజీగా మారడానికి ప్రయత్నిస్తోంది. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి చాలా కష్టపడుతోంది కానీ, సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. గతేడాది ఆమె హీరోయిన్ గా నటించిన 'ఖుషి', 'శాకుంతలం' వంటి రెండు పాన్ ఇండియా సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి. దీంతో రీసెంట్ గా వచ్చిన 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కానీ ఇది ఓటీటీ ఆడియన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే కామెంట్స్ వచ్చాయి.

బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్‌ తో కలిసి సమంత నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ''సిటాడెల్‌: హనీ బన్నీ''. ‘ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ ‘గన్స్ అండ్ గులాబ్స్’ వంటి సక్సెస్ ఫుల్ సిరీస్‌లతో అలరించిన దర్శక ద్వయం రాజ్‌ & డీకే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ మధ్యనే సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ సిరీస్ కు, వీక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో చాలా వరకు నెగెటివ్ రివ్యూస్ కనిపించాయి. ఒకటి రెండు రోజులు ఈ సిరీస్ గురించి నెట్టింట సందడి కనిపించింది కానీ, ఆ తర్వాత ఎవరూ దీనిపై ఎక్కువగా మాట్లాడుకోలేదు.

'సిటాడెల్‌: హనీ బన్నీ' స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే మాత్రం సమంత కిస్ సీక్వెన్స్, ఆమె టాప్ తీసేసే క్లిప్పింగ్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరిగాయి. కానీ ఈ సిరీస్ లోని మిగతా అంశాల గురించి పెద్దగా డిస్కషన్ జరగలేదు. కాకపోతే సమంత వరకూ తన పాత్రకు న్యాయం చేసిందని, స్పై ఏజెంట్ గా యాక్షన్ సీన్స్ లో మెరిసిందని అభిమానులు కామెంట్స్ చేసారు. అయినప్పటికీ ఓవరాల్ గా ఈ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్‌’ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయిందని, ఏమంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

మయోసైటిస్‍ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సమయంలో సమంత కొంతకాలం విశ్రాంతి తీసుకుంది. 'సిటాడెల్‌: హనీ బన్నీ' సిరీస్ తో డిజిటల్ స్పేస్ లోకి రావడంతో, బిగ్ స్క్రీన్ మీదకు ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె బర్త్ డే సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ అనే మూవీని అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాని తన హోమ్ ప్రొడక్షన్ లో త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.

అయితే రాజ్‌ & డీకే లతో సామ్ మరో వెబ్ సిరీస్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించే “రక్త్ బ్రహ్మాండ్ - ది బ్లడీ కింగ్‌డమ్” అనే ఫాంటసీ యాక్షన్ సిరీస్ లో ఆమె భాగం కానున్నట్లు తెలుస్తోంది. 'తుంబాడ్' ఫేమ్ రాహి అనిల్ బార్వే దీనికి దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్ ను డి2ఆర్ ఫిల్మ్స్ నిర్మించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. కానీ సమంత నటిస్తుందనే విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఏదేమైనా సమంత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని, ఎప్పటిలాగా వరుసగా సినిమాలు చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    
  • Samantha 
  • Citadel 
  • Citadelhoneybunny 
  • Webseries 
  • Amazonprime 
  • Rajanddk 
  • Netfilx 
  • Familyman 
  • Farzi 
  • Maaintibangaramupdate 
  • Samanthamovies 
  • Filmindustry 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS