అనిల్ వాడ‌కం మామూలుగా లేదుగా!

నెట్టింట స‌రికొత్త ప్ర‌మోష‌న‌ల్ వీడియోల‌తో సినిమాని వైర‌ల్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా మ‌రోసారి అనిల్ రావిపూడి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.;

Update: 2025-12-22 05:55 GMT

సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఫాలో అవుతున్న స్టైలే వేరుగా ఉంటోంది. త‌న‌దైన పంథాని అప్లై చేస్తూ సినిమా ప్ర‌మోష‌న్స్‌ని కొత్త పుంత‌లు తొక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు` చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ ద‌గ్గ‌రి నుంచి కొత్త ఫార్ములా పాటిస్తూ ప్ర‌మోష‌న‌ల్ వీడియోల‌తో పిచ్చెక్కిస్తున్నాడు. ప్ర‌తీదాన్ని సినిమా ప్ర‌మోష‌న్స్‌కు వాడుకుంటూ ప్రేక్ష‌కుల అటెన్ష‌న్‌ని గ్రాబ్ చేస్తున్నారు.

నెట్టింట స‌రికొత్త ప్ర‌మోష‌న‌ల్ వీడియోల‌తో సినిమాని వైర‌ల్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా మ‌రోసారి అనిల్ రావిపూడి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. లేటెస్ట్ సెన్సేష‌న్ `ఏఐ` టెక్నాల‌జీని కూడా త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం అనిల్ రావిపూడి వాడేశారు. ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోని తాజాగా విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారి అనిల్ వాడ‌కాన్ని చూసి అంతా అవాక్క‌య్యేలా చేస్తోంది.

`అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి..ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వ‌ర‌కు` అంటూ అనిల్ అభిమానుల‌తో పంచ‌యుకున్న వీడియో ఆక‌ట్టుకుంటోంది. `ఖైదీ, గ్యాంగ్ లీడ‌ర్‌, ఘ‌రానా మొగుడు, జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి, ముఠామేస్త్రీ, అంజి, ఇంద్ర‌, శంక‌ర్ దాదా ఎంబీబిఎస్‌, ఠాగూర్ సినిమాల్లోకి కీల‌క స‌న్నివేశాలు, సాంగ్స్ షూటింగ్స్ జ‌రుగుతున్న సెట్స్‌కు వెళ్లిన అనిల్ ..మెగాస్టార్‌తో దిగిన‌ట్టుగా ఏఐ వీడియోని క్రియేట్ చేయించి చిరుపై త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

ఈ వీడియోలో అనిల్ వింటేజ్ చిరుని ప‌రిచ‌యం చేయ‌డంతోమెగా అభిమానులంతా స‌ర్‌ప్రైజ్ ఫీల‌వుతున్నారు. దీంతోబ ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట‌వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు సంబ‌ర‌ప‌డుతుంటే కొంత మంది మాత్రం అనిల్ వాడ‌కం మామూలుగా లేదుగా... సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం దేన్నీ వ‌ద‌ల‌డం లేదుగా అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2025 సంక్రాంతికి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `సంక్రాంతికి వ‌స్తున్నాం` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న అనిల్ 2026 సంక్రాంతికి కూడా అదే ఫీట్‌ని రిపీట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవితో రూపొందుతున్న `మ‌న శంక‌ర‌వ‌ర‌స్ర‌సాద్‌గారు`తో సంక్రాంతి బ‌రిలో దిగుతున్నారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ జ‌న‌వ‌రి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. వెంకీ మామా తొలి సారి చిరుతో క‌లిసి ఈ మూవీలో గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నున్న ఈ మూవీ అనిల్ మార్కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో సంక్రాంతి రేస్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.



Tags:    

Similar News