హాస్యాన్ని మించి ఉర్రూత‌లూగిస్తాం: అనీల్ రావిపూడి

మెగా ఫ్యాన్స్ సంద‌డి న‌డుమ ఈ కార్యక్ర‌మం ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. ఈ చిత్రం కేవలం ఒక కామెడీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని, ఇందులో బలమైన భావోద్వేగాలు, చ‌క్క‌ని కుటుంబ క‌థ ఆక‌ట్టుకుంటాయ‌ని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్ల‌డించారు.;

Update: 2026-01-08 03:58 GMT

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన `మ‌న శంక‌ర‌వ‌రప్ర‌సాద్ గారు` సంక్రాంతి కానుక‌గా ఈనెల 12న విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్ 45 నిమిషాల నిడివి ఉన్న పాత్ర‌లో న‌టించార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక‌ హైదరాబాద్‌లో జరిగింది.

మెగా ఫ్యాన్స్ సంద‌డి న‌డుమ ఈ కార్యక్ర‌మం ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. ఈ చిత్రం కేవలం ఒక కామెడీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని, ఇందులో బలమైన భావోద్వేగాలు, చ‌క్క‌ని కుటుంబ క‌థ ఆక‌ట్టుకుంటాయ‌ని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్ల‌డించారు. చిరంజీవి -వెంకటేష్‌ల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. వారిద్దరి మ‌ధ్యా సన్నివేశాలు ఈ చిత్రానికి అతిపెద్ద హైలైట్ అని రావిపూడి అన్నారు. అత‌డు ఇంకా మాట్లాడుతూ ''నా గత సినిమాల‌ను ప్రేక్షకులు ఇప్పటికే చూశారు.. నేను కథ చెప్పే శైలిని అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాను. సంక్రాంతి బ‌రిలో విజ‌యం అందిస్తార‌నే ధీమా ఉంది. మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు చిత్రంలో హాస్యాన్ని మించి ఆస్వాధించేందుకు చాలా ఉంది. ఈ సినిమా కథనంలో భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ను ఒక సరికొత్త అవతార్‌లో చూసి చిరంజీవి అభిమానులు ఉర్రూతలూగిపోతారు`` అని అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ వెన‌క కె.రాఘ‌వేంద్ర‌రావు ప్రోద్భ‌లం ఉంద‌ని వెల్ల‌డించారు. అనీల్ రావిపూడి కామెడీ టైమింగ్ అద్భుతం.. మీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తే చూడాల‌నుంద‌ని కె .రాఘ‌వేంద్ర‌రావు త‌న‌తో అన్నార‌ని చిరు గుర్తు చేసుకున్నారు. యాథృచ్ఛికంగా రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమాని క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఆయ‌న కామెడీని బాగా ఇష్ట‌ప‌డతారు.. ఆయ‌న సినిమాల్లో ఘ‌రానా మొగుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అలాంటి విజ‌యం సాధిస్తామ‌ని చిరు అన్నారు.

ప్రీరిలీజ్ లో భీమ్స్ అందించిన ర్యాప్ సాంగ్ ని లాంచ్ చేయ‌గా, అనీల్ రావిపూడి- విక్ట‌రీ వెంక‌టేష్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. మెగాస్టార్ ఆ సమ‌యంలో చాలా ఎగ్జ‌యిట్ అవ్వ‌డం క‌నిపించింది. ప్రీఈవెంట్ ఆద్యంతం స‌ర‌దాగా జోష్ తో సాగిపోయింది.

11 జ‌న‌వ‌రి నుంచే ప్రీమియ‌ర్లు:

మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు ఈ సంక్రాంతి బ‌రిలో మోస్ట్అవైటెడ్ చిత్రాల‌లో ఒక‌టిగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. 12 జ‌న‌వ‌రి రిలీజ్ తేదీ కాగా, ఒక రోజు ముందు ప్రీమియర్స్ అందుబాటులో ఉంటాయని నిర్మాత‌లు వెల్లడించారు. జనవరి 11 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్స్ ని వేస్తున్నామ‌ని కూడా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సాహు గారపాటి - సుష్మిత కొణిదెల నిర్మించారు.






Tags:    

Similar News