ఇక్రిసాట్ స్కూల్ కి పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?

ఈ క్రమంలోనే పటాన్ చెరులోని ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ స్కూల్ కి మార్క్ శంకర్ అడ్మిషన్ గురించి పవన్ వెళ్లినట్టు తెలుస్తుంది.;

Update: 2025-06-13 12:08 GMT

పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టార్ హీరో మాత్రమే కాదు ఏపీ డిప్యూటీ సీఎం కూడా ఇదివరకు ఆయన ఎక్కడ కనిపించినా అదేదో షూటింగ్ కోసం వచ్చారేమో అనుకుంటారు. కానీ ఇప్పుడు పవన్ ఎక్కడ కనిపించినా రాష్ట్రానికి సంబంధించిన పనుల గురించి అని ఆలోచించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని పటాన్ చెరు లోని ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ స్కూల్ కి రావడం సర్ ప్రైజింగ్ గా ఉంది.

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్ కోసం అక్కడకి వెళ్లినట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ ఈమధ్యనే సింగపూర్ స్కూల్ లో అగ్నిప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఆ టైం లో పవన్ కళ్యాణ్ చాలా కంగారు పడ్డారు. ఇక మీదట మార్క్ శంకర్ హైదరాబాద్ లోనే ఉండి చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఏర్పడిన హెల్త్ ఇష్యూస్ నుంచి కోలుకున్నాడు.

ఐతే పవన్ ఇక తన ఎడ్యుకేషన్ మిగతా వ్యవహారాలన్నీ కూడా తనకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పటాన్ చెరులోని ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ స్కూల్ కి మార్క్ శంకర్ అడ్మిషన్ గురించి పవన్ వెళ్లినట్టు తెలుస్తుంది. సాధారణంగా హీరో ఏదైనా స్కూల్ కి వెళ్తే షూటింగ్ కోసమో లేక తనకు వచ్చిన ఇన్విటేషన్ వల్లో అనుకుంటారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ అవ్వడం వల్ల ఆయన స్కూల్ కి వెళ్లిన విషయం ఏమై ఉంటుందా అని అందరు తెలుసుకోవాలని అనుకుంటారు.

పొలిటికల్ గా బిజీ అయ్యాక పవన్ సినిమాలను కూడా తగ్గించాడు. ఆల్రెడీ కమిటైన సినిమాలు పూర్తి చేయడానికే చాలా టైం తీసుకుంటున్నారని తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు రావాల్సి ఉంది. వీటితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఈ 3 సినిమాల తర్వాత పవన్ నెక్స్ట్ సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటారన్న టాక్ అయితే నడుస్తుంది. పొలిటికల్ గా బిజీగా ఉన్నా ఫ్యాన్స్ కోసం పవన్ సినిమాలు చేస్తారనే అందరు అనుకుంటున్నారు. కాకపోతే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేసి త్వరగా రిలీజ్ చేస్తే బెటర్ కానీ ఏళ్లకు ఏళ్లు సెట్స్ మీద ఉంటే మాత్రం నిర్మాతలు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News