• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #లవ్ బ‌ర్డ్స్.. ఇదంతా...

#లవ్ బ‌ర్డ్స్.. ఇదంతా పీఆర్ జిమ్మిక్కేనా?

| అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్‌ల డేటింగ్ పుకార్లు చాలా కాలంగా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మ‌రోసారి ఈ జంట మీడియా కంటికి చిక్కింది.

By - Tupaki Desk
Update: 2023-10-28 10:30 GMT

అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్‌ల డేటింగ్ పుకార్లు చాలా కాలంగా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మ‌రోసారి ఈ జంట మీడియా కంటికి చిక్కింది. జంట డిన్న‌ర్ డేట్ కోసం ముంబైలో ఔటింగుకి వెళ్ల‌డంతో కెమెరాలు వారిపై విరుచుకుపడ్డాయి. సోషల్ మీడియాలో కనిపించిన ఒక వీడియోలో అనన్య - ఆదిత్య ఒక రెస్టారెంట్‌లో తమ స్నేహితులతో ఇంటరాక్ట్ అవుతూ క‌నిపించారు. ఈ ఇద్ద‌రూ బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో కవలల్లా కనిపించారు.

దీనితో పాటు మరొక వీడియో కూడా నెటిజ‌నుల్లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూడ‌గానే, ఆ ఇద్దరూ క‌చ్చితంగా డేటింగ్ చేస్తున్నారని న‌మ్మాల్సిందే. ఈ వైరల్ క్లిప్‌లో అన‌న్య పాండే.. ప్రియుడు ఆదిత్య చేతిని పట్టుకుని కనిపించింది. అంతేకాదు త‌ల‌ను అత‌డి భుజంపై ఉంచింది. వారు ఇత‌రుల‌తో సంభాషిస్తున్నప్పుడు అందరూ నవ్వుల్లో మునిగిపోయిన వీడియో వైర‌ల్ అయింది.

ఈ వీడియోపై నెటిజన్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేసారు. ``మీకు గోప్యత లేదు. ప్రతిదాన్ని పబ్లిక్ కోసం చేయవద్దు`` అని ఒక అభిమాని వ్యాఖ్యానించ‌గా, మరొక వ్యాఖ్య ఇలా ఉంది. ``ఉఫ్ ఆ ఒక్క అమ్మాయేనా?.. ఆమెను ఎవరూ పట్టించుకోరు! ప్రతి స్త్రీ అలాంటి వ్యక్తి (ఆదిత్య‌)ని పొందాలని కోరుకుంటారు`` అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.

అనన్య, ఆదిత్య జంట డేటింగ్‌లో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గతేడాది `కాఫీ విత్ కరణ్ 7`లో అనన్య కనిపించిన తర్వాత ఇదంతా మొదలైంది. కరణ్ జోహార్ తాను ఆదిత్య కలిసే ఉన్నారంటూ హింట్ ఇవ్వ‌గానే, వారి సంబంధం గురించి చ‌ర్చ మొద‌లైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, అనన్య -ఆదిత్య యూరప్‌లో రొమాంటిక్ డేట్ ని ఆస్వాధించారు. దీనికి ముందు అనన్య - ఆదిత్య కలిసి మాడ్రిడ్‌లో ఆర్కిటిక్ మంకీస్ కచేరీకి హాజరయ్యారు

ప్ర‌ముఖ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్యను వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప్ర‌శ్నించారు. మీ వ్యక్తిగత జీవితం వ‌ల్ల‌ వృత్తిపరమైన జీవితం చిక్కుల్లో ప‌డుతుందేమో? అని అడిగారు. అయితే త‌న సినిమాల రిలీజ్ లు ఆల‌స్య‌మ‌వ్వ‌డంపై అన‌న్య క‌ల‌త‌కు గురైంది. దురదృష్టవశాత్తు గత సంవత్సరం నాకు విడుదల లేదు కాబట్టి ఆ సమయంలో నా వ్యక్తిగత జీవితం గురించి జ‌నం గుస‌గుస‌లు స‌హ‌జం`` అని వ్యాఖ్యానించింది. అన‌న్య పాండే న‌టించిన తెలుగు సినిమా లైగ‌ర్ డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇది త‌న‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమాకి ఈ భామ సంత‌కం చేయ‌లేదు.

Tags:    
  • Ananyapandey 
  • Adityaroykapur 
  • Tollywood 
  • Filmindustry 
  • Actressananyapandey 
  • Liger 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS