అనకాపల్లి నుంచి ‘ఎలగే పిల్ల’.. క్యూట్ మెలోడీ
టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘అనకాపల్లి’. ఈ సినిమా ఆగస్ట్ 7వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘అనకాపల్లి’. ఈ సినిమా ఆగస్ట్ 7వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఖగేష్ తమ్మినేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ సాంగ్ ను వదిలారు.
ఈ సినిమాలోని ‘ఎలగే పిల్ల’ అనే లవ్ ట్రాక్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ లాంచ్ చేశారు. సాంగ్ విజువల్స్, ట్యూన్ బాగున్నాయని చెబుతూ చిత్ర యూనిట్ కు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. అలాగే స్టెప్పులు, లిరికల్ వీడియోలోని లొకేషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇక సాంగ్ వినేటప్పుడు ఒక క్లాసిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందనే కామెంట్స్ వస్తున్నాయి.
హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ ను చాలా న్యాచురల్ గా ప్రెజెంట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో మెలోడీ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఈ పాటకు సింపుల్ పదాలతో కూడిన సాహిత్యం అందించారు. కపిల్ కపిలాన్, దేవ్ జండ్ ల వాయిస్ ఈ రొమాంటిక్ నంబర్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయింది. ఇన్ స్టంట్ గా యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఈ మెలోడీ సాగింది.
కొరియోగ్రఫీ పరంగా కూడా ఎక్కడా ఓవర్ గా లేకుండా సింపుల్ డ్యాన్స్ మూవ్స్ తోనే మేనేజ్ చేశారు. లీడ్ పేయిర్ విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట ఇద్దరూ ఈ హుక్ స్టెప్స్ ను చాలా ఈజీగా చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా రీల్స్ ఎక్కువగా చేసే నేటి తరం నెటిజన్లను ఈ డ్యాన్స్ బిట్స్ బాగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఈ హుక్ స్టెప్పులు ట్రెండ్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఇందులో ఒక కీలకమైన పాత్రలో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అమ్మోరు దిగినాది, లబ్బరు బొమ్మ సాంగ్స్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబట్టాయి. ఇప్పుడు వచ్చిన ఈ మూడో సాంగ్ కూడా సినిమాపై ఉన్న బజ్ ను మరింత పెంచేలా ఉంది. ఉదయ్ భాగవతులు ఈ రస్టిక్ డ్రామాకు డైలాగ్స్ అందించారు.
ఈ సినిమాకు దేవ్ జండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, మాయా వి డీఓపీగా వర్క్ చేశారు. శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రంలో తారక్ పొన్నప్ప, ఇంద్రజ, నందిని రాయ్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 7న రాబోతున్న ఈ విలేజ్ డ్రామా థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.