అక్కినేని క్వీన్ నుంచి సమంతకు సపోర్ట్.. వ్వాటే మూమెంట్!
సమంతను గౌరవంగా చూస్తూ, చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ ఆమెకు మద్దతుగా నిలిచిన అమల హావభావాలు ఆవిడ మౌనాన్ని మాటలుగా మార్చేశాయి.;
జీ తెలుగు అవార్డ్స్ వేడుకలో ఒక చిన్న మూమెంట్ ఇప్పుడు ఎమోషనల్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అమల అక్కినేని – సమంత అనుబంధం గురించి గతంలో ఎన్నో చర్చలు జరిగినా, ఇప్పుడు అవి మరలా మనసులను తాకేలా ఉన్నాయి. పలు సందర్భాల్లో గతాన్ని మర్చిపోయినట్టు కనిపించినా, ఈసారి అమల హావభావాలు ప్రత్యేక అర్థాన్ని సంతరించుకున్నాయి.
సమంత తన 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ అందుకున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన స్పీచ్‌తో స్టేజ్ మీద భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ధైర్యం, కృషిని ప్రస్తావిస్తూ మాట్లాడిన ఆ పదాలు, ప్రేక్షకులను మాత్రమే కాకుండా ముందున్న వ్యక్తినీ కదిలించాయి. ఆమె ముందున్న వారు ఎవరో కాదు.. అక్కినేని క్వీన్, ఆమె మాజీ అత్త అమల.
సమంతను గౌరవంగా చూస్తూ, చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ ఆమెకు మద్దతుగా నిలిచిన అమల హావభావాలు ఆవిడ మౌనాన్ని మాటలుగా మార్చేశాయి. ఈ వీడియో ప్రోమో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. “అమల గారి చూపులో ఆప్యాయత కనిపించింది” అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. “ఆ స్మైల్ వెనుక ఎన్ని గుర్తులు ఉన్నాయో” అంటూ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
విడాకుల తర్వాత వారి మధ్య దూరం పెరిగినా, స్నేహ బంధం మళ్లీ ఒక్క క్షణానికి అనుబంధాన్ని గుర్తు చేసినట్టు కనిపించింది. నాగచైతన్య సమంత వివాహం 2017లో జరిగింది. కానీ 2021లో వారు విడాకుల ప్రకటన చేసి ఇద్దరూ వేరువేరుగా ముందుకు సాగిపోయారు. అప్పట్లో ఈ విడాకులు మీడియా లో సెన్సేషన్‌గా మారాయి.
అయినా కూడా సమంత అక్కినేని కుటుంబం మధ్య పరస్పర గౌరవం కనిపించేది. తాజాగా ఈ ఈవెంట్‌లో అమల సపోర్ట్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ హావ భావం, ఓ చిరునవ్వు, ఓ గౌరవం అన్నీ కలిస్తే అది మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటుతుంది. అలాంటి అనుభూతుల్ని నెమ్మదిగా మనసుల్లోకి తెచ్చేలా ఉంది అమల స్మైల్. “వీళ్ల మధ్య ఎంత ఎమోషనల్ బాండ్ ఉండేదో ఇప్పుడు తెలుస్తోంది” అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.