• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ రికార్డ్...

బన్నీ రికార్డ్ మైల్​స్టోన్​.. ఆయన అవార్డ్స్​ లిస్ట్​ ఇదే

| తాజాగా ఈ చిత్రంతో ఇప్పుడు బన్నీ నేషనల్‌ అవార్డును కూడా సొంతం చేసుకుని.. తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశారు.

By - Tupaki Desk
Update: 2023-08-26 12:31 GMT

స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసే 'ఆర్య' ఆయన. దేశముదురుగా కనిపించినా.. జులాయిగా తిరిగినా.. డీజే అంటూ యాక్షన్‌ చేసినా.. ఆయన అభిమానులు ఫుల్​ హ్యాపీ. ప్రొఫెషనల్​, పర్సనల్​ లైఫ్​ను బ్యాలెన్స్‌ చేసే సరైనోడు ఆయన. 'విలువలే ఆస్తి' అని తండ్రి కోసం ఏదైనా చేసే ఓ మంచి కొడుకు. అన్న కోసం ఎవడినైనా ఎదురించగలే రేసుగుర్రం. ఆయనే... ఆడా.. ఈడా ఉంటూ అటు క్లాస్‌ ఆడియన్స్‌ను, ఇటు మాస్‌ ప్రేక్షకులను అలరిస్తున్న బాక్సాఫీస్ పుష్ప రాజ్​ ఐకాన్​ స్టార్ అల్లుఅర్జున్​.

తాజాగా ఆయన.. 'పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు..' అంటూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ యాక్టింగ్​, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌.. ఇలా అన్నీ ఇండియావైడ్​గా సినీ ప్రేక్షకులను తన మాస్‌ అవతార్​తో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించడంతో పాటు బన్నీ ఖాతాలోకి పలు రికార్డులు కూడా చేరాయి.

తాజాగా ఈ చిత్రంతో ఇప్పుడు బన్నీ నేషనల్‌ అవార్డును కూడా సొంతం చేసుకుని.. తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశారు. అయితే ఈ అవార్డుతో ఆయన తన అవార్డ్స్​ లిస్ట్​లో ఓ మైలురాయిని చేరుకున్నారు.

తాజా నేషనల్ అవార్డ్​తో కలిపి తన కెరీర్​లో 50వ అవార్డుకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. 'విజేత', 'స్వాతిముత్యం' వంటి సినిమాలతో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన 'డాడీ' సినిమాలో డ్యాన్సర్‌గా ఓ చిన్న పాత్రలో మెరిశారు. ఆ తర్వాత 'గంగోత్రి'తో హీరోగా తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే అవార్డును అందుకున్నారు. అప్పుటి నుంచి కెరీర్​లో ఎదురైన ప్రతి సవాల్‌ను, విమర్శలను స్వీకరించి నటుడిగా తనని తాను అద్భుతంగా మలుచుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి స్టార్​గా ఎదిగారు. అయితే ఈ జర్నీలో తాను నటించిన ప్రతి సినిమాతో ఏదో ఒక అవార్డును ముద్దాడారు. అలా ఇప్పుటివరకు 50 అవార్డులను స్వీకరించారు.

వాటిలో గంగోత్రికి 3, ఆర్య 4, బన్నీ 1, దేశముదురు 2, పరుగు 5, ఆర్య 2-2, వేదం 3, బద్రినాద్​ 1, ఇద్దరు అమ్మాయిలతో 1, రేసుగుర్రం 5, సన్నాఫ్ సత్యమూర్తి 1, రుద్రమదేవి 6, సరైనోడు 2, అలవైకుంఠపురంలో 4, పుష్ప 4(జాతీయ అవార్డుతో కలిపి), ఇంకా పలు అవార్డులను కూడా ముద్దాడారు.

Tags:    
  • Alluarjun 
  • Iconstar 
  • Nationalaward 
  • Pushpetherise 
  • Sukmar 
  • Tollywood 
  • Vijetha 
  • Gangotri 
  • Bestactor 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS