• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RTO ఆఫీస్ కు అల్లు...

RTO ఆఫీస్ కు అల్లు అర్జున్.. పెద్ద ప్లానే వేశారుగా!

| ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మరికొద్ది నెలల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా యాక్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-03-20 14:36 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పుష్ప-1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మేకర్స్.. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎలా అయినా ఆగస్టు 15వ తేదీన సినిమా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు అనుగుణంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు పుష్ప మేకర్స్.


ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మరికొద్ది నెలల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా యాక్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి పెద్ద వ్యాపారవేత్తగా మారి.. సిండికేట్ బిజినెస్ ను ఎలా చేశారన్న పాయింట్ తో సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాపై అటు నార్త్ లో ఇటు సౌత్ లో బజ్ ఓ రేంజ్ లో ఉంది.


ప్రస్తుతం పుష్ప మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. సడెన్ గా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో మెరిశారు. బుధవారం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లిన బన్నీ.. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ ను పూర్తి చేశారు. అయితే పుష్ప-2లోని కొన్ని సీన్స్ త్వరలో జపాన్ లో షూట్ చేయనున్నారట. అందుకే బన్నీ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారట.

మరోవైపు, రేంజ్‌ రోవర్‌ కారును TG 09 0666 నంబర్‌ తో తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని కూడా తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ ఆర్టీవో ఆఫీస్ కు రావడంతో అక్కడికి ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చి బందోబస్తు పెట్టించారు. కానీ పలువురు ఫ్యాన్స్ బన్నీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వైట్ షర్ట్ లో వచ్చిన అల్లు అర్జున్.. ఫుల్ హెయిర్, గడ్డంతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం బన్నీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ లో పుష్ప వైబ్స్ కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంటర్నేషనల్ లైసెన్స్ వెనుక పెద్ద ప్లానే ఉందని అంటున్నారు. ఇక పుష్ప తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Pushpa2 
  • Sukumar 
  • Alluarjun 
  • Rtooffice 
  • Khairatabad 
  • Internationaldrivingpermit 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS