లెజెండ్స్ స‌ర‌స‌న అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ దర్శకత్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య `రాకా` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-04-16 10:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ దర్శకత్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య `రాకా` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన బ‌న్నీ లుక్ తో అంచ‌నాలు రెట్టింపు చేసారు. బ‌న్నీ- అట్లీ క‌లిసి ఏచేయ‌బోతున్నారు? అంటూ ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఇద్ద‌రి కెరీర్ లో ఇదో అతి పెద్ద ప్ర‌యోగ‌మ‌ని ఫ‌స్ట్ లుక్ తోనే తేలిపోయింది. తాజాగా బ‌న్నీ పాత్ర కోసం ఎంత‌గా శ్ర‌మిస్తున్నాడు? అన్న‌ది వెలుగులోకి వ‌చ్చింది.ఆ పాత్ర కోసం మేకప్ వేసుకోవడానికే ప్రతిరోజూ మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతోందిట‌. అందుకోసం బ‌న్నీ తెల్లవారుజామునే సెట్స్‌కు చేరుకుని ఎంతో సహనంతో మేకప్ పూర్తి చేసుకుని షూటింగ్‌లో పాల్గొనడం బన్నీ అంకితభావానికి నిదర్శనం చెప్పొచ్చు.

మేకప్ వేసుకోవడం ఒక ఎత్తు అయితే? ఆ భారీ మేకప్‌ను ధరించి రోజంతా లైట్ల వెలుతురులో, వేడిలో షూటింగ్ చేయడం మరో ఎత్తు. ఆ మేకప్ వల్ల చర్మంపై కలిగే అసౌకర్యాన్ని భరిస్తూ ముఖ కవళికలు ఏమాత్రం దెబ్బ తినకుండా నటించడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. `రాకా` షూటింగ్ సమయంలో బన్నీ అవేమీ లెక్కచే యకుండా ఆ గెటప్‌లోనే గంటల తరబడి యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొంటు న్నారు. ఆయన పడుతోన్న ఈ కష్టం వెండితెరపై ఓ విజువల్ వండర్‌ను సృష్టించబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

భారతీయ సినీ చరిత్రలో పాత్ర కోసం ఇలాంటి సాహసాలు చేసిన వారు చాలా తక్కువ మంది. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (రోబో సిరీస్), ఉలగనాయగన్ కమల్ హాసన్ ( భామ‌నే స‌త్య‌భామ‌నే, భారతీయుడు, దశావతారం), చియాన్ విక్రమ్ (ఐ) వంటి దిగ్గజాలు మాత్రమే ప్రోస్తెటిక్ మేకప్ కోసం గంటల తరబడి కేటాయించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు. తాజాగా ఆ లెజెండ్స్ సరసన అల్లు అర్జున్ కూడా చేరడం విశేషం. నటనతోనే కాకుండా శారీరక శ్రమతో కూడా అగ్ర నటుల జాబితాలో బ‌న్నీ నిల‌వ‌డం విశేషం.

అల్లు అర్జున్ ప్రతి సినిమాకు మునుపటి కంటే మెరుగ్గా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. `పుష్ప` సినిమా కోసం చిత్తూరు యాస నేర్చుకోవడం, భుజం వంచి నడవడం వంటివి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు ను తెచ్చి పెట్టాయి. `పుష్ప‌2` లో గంగ‌మ్మ జాత‌ర‌లో బ‌న్నీ త‌యారైన విధానం తెలిసిందే. అమ్మ‌వారి అవ‌తారంలో బ‌న్నీ ఒదిగిపోయాడు. ఆ జాత‌ర మ్యాక‌ప్ కోసం కొన్ని గంట‌ల పాటు స‌మ‌యాన్ని కేటాయించాల్సి వ‌చ్చింది. తాజాగా `రాకా` కోసం అంతకు మించిన డెడికేషన్‌ను చూపిస్తున్నారు. కేవలం మేకప్ తోనే కాక‌ ఆ పాత్రకు తగ్గట్టుగా ఆహార్యాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడంలో బ‌న్నీ చూపిస్తున్న శ్రద్ధను చూసి విశ్లేషకులు ప్ర‌శంశిస్తున్నారు.

Tags:    

Similar News