ఆలియా-ర‌ణ‌బీర్ మాతృదినోత్స‌వ వేడుక ఇలా

ఎంతో విలాస‌వంత‌మైన భారీ భ‌వంతిలో మాతృదినోత్స‌వ సెల‌బ్రేష‌న్ ఎంతో అద్భుతంగా జ‌రిగింద‌ని తాజాగా రిలీజైన ఫోటోగ్రాప్ చెబుతోంది.

Update: 2024-05-13 11:52 GMT

ఎంత బిజీ లైఫ్ ఉన్నా జాలీగా గ‌డ‌ప‌డానికి ఒక స‌మ‌యం కావాలి. అలాంటి గ్రేట్ మూవ్ మెంట్ ని ఆస్వాధిస్తున్నారు ఇక్క‌డ ఆలియా- ర‌ణ‌బీర్. ఈ జంట త‌మకు ఎంతో ఇష్ట‌మైన మామ్స్ (మాతృదినోత్స‌వం సంద‌ర్భంగా) తో క‌లిసి విలువైన స‌మ‌యాన్ని గ‌డిపారు. ఎంతో విలాస‌వంత‌మైన భారీ భ‌వంతిలో మాతృదినోత్స‌వ సెల‌బ్రేష‌న్ ఎంతో అద్భుతంగా జ‌రిగింద‌ని తాజాగా రిలీజైన ఫోటోగ్రాప్ చెబుతోంది.


ఆలియా భ‌ట్ త‌న త‌ల్లి సోని ర‌జ్దాన్.. త‌న సోద‌రి ష‌హీన్ భ‌ట్ ల‌తో క‌లిసి ఉంది. ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న త‌ల్లి నీతూ సింగ్ తో క‌లిసి ఈ పార్టీలో జాయిన‌య్యాడు. ర‌ణ‌బీర్, ఆలియా ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీ బిజీ. ర‌ణ‌బీర్ యానిమ‌ల్ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు క‌మిట‌య్యాడు. ప్ర‌స్తుతం రామాయ‌ణం చిత్రంలో న‌టిస్తున్నాడు. ఆలియాతో క‌లిసి ఓ సినిమాలో న‌టించాల్సి ఉంది. ఆలియా కూడా ఇత‌ర సినిమాల‌కు క‌మిట‌వుతోంది. ఇంత బిజీలోను ఒక ప్ర‌త్యేక‌మైన రోజును అద్భుతంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు ఈ జోడీ.

సింగిల్ గ‌దిలో జీవించాం.. ఆలియా త‌ల్లి సోని:

ఆలియా భ‌ట్ త‌ల్లి ప్రముఖ నటి సోనీ రజ్దాన్, తాను త‌న‌ భర్త మహేష్ భట్ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్ట సమయాలను గుర్తు చేసుకున్నారు. వారు ఒక పడకగది ఉన్న‌ చిన్న ఫ్లాట్‌లో నివసించారు. కుటుంబ‌ అవసరాలను తీర్చడానికి మ‌హేష్ భ‌ట్ చాలా కష్టపడ్డారు. అత‌డు ఎప్పుడూ ఉద్యోగ బాధ్య‌త‌ల్లో నిమగ్నమై ఉండటంతో సోనీ ర‌జ్దాన్ వారి కుమార్తెలు ఆలియా - షాహీన్ భట్‌లకు సింగిల్ పేరెంట్‌గా భావించాన‌ని తెలిపారు. షాహీన్‌ పుట్టిన మూడు వారాలకే మహేష్ భ‌ట్ పని (ఉద్యోగం) కోసం ఎలా వెళ్లాల్సి వచ్చిందో గుర్తు చేసుకుంది.

Read more!

తాజాగా ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో ఆలియా శిశువుగా ఉన్న సమయాన్ని సోని ర‌జ్దాన్ గుర్తుచేసుకుంది. ఆమె మాట్లాడుతూ, ``ఆ సమయంలో నేను సింగిల్ పేరెంట్‌గా భావించాను. మహేష్ సపోర్టుగా ఉన్నాడు. కానీ అతడు రోజుకు మూడు సినిమాల షూటింగ్ ల‌తో బిజీగా ఉండేవాడు. అత‌డు షూటింగుల‌కు వెళ్లినప్పుడు ష‌హీన్ కి కేవలం మూడు వారాల వయస్సు మాత్రమే.. నాకు గుర్తుంది .. రాత్రి నిద్రించడానికి నిరాకరించిన శిశువుతో నేను గ‌డిపాను.

అప్పుడు మేము ఒక‌ చిన్న సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నివసించాము. మా వద్ద డబ్బు లేదు.. మేము చిన్నవాళ్ళం, మేం డ‌బ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాము. కానీ పిల్లలను ఎంతో ప్రేమగా పెంచాం. మా వద్ద స్మార్ట్‌ఫోన్‌లు లేవు - అలియాకు ప్లే రూమ్ కూడా లేదు. కానీ అప్పుట్లో జీవితం ఎంతో సింపుల్ గా ఉంది`` అని తెలిపారు.

అయితే తన మనవరాలు రాహా కపూర్‌కి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సోనీ తెలిపింది. ఆమె మాట్లాడుతూ, “ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డను బాగా పెంచాలని భావిస్తారు.. తమ బిడ్డ వారికి త‌మ‌కంటే బాగా జీవించాల‌ని కోరుకుంటారు. నేడు రాహాకు కావాల్సినంత ఉంది... అని సోని వివ‌రించారు. అలియా -రణబీర్ కపూర్ 2022లో రాహాను స్వాగతించారు.

Tags:    

Similar News