2500 కోట్లకు అధిప‌తి.. 25ల‌క్ష‌ల కోసం పెళ్లిలో డ్యాన్సులు!

ఆ న‌టుడి నిక‌ర ఆస్తి విలువ 2500కోట్లు. కానీ అత‌డు పెళ్లిలో ఆదాయాన్ని కూడా వ‌దులుకోడు. కేవ‌లం కొన్ని ల‌క్ష‌ల కోసం షూటింగ్ మ‌ధ్య‌లో వ‌దిలేసి పెళ్లి రిసెప్ష‌న్ కి వెళ్లాడు;

Update: 2025-09-23 21:30 GMT

ఆ న‌టుడి నిక‌ర ఆస్తి విలువ 2500కోట్లు. కానీ అత‌డు పెళ్లిలో ఆదాయాన్ని కూడా వ‌దులుకోడు. కేవ‌లం కొన్ని ల‌క్ష‌ల కోసం షూటింగ్ మ‌ధ్య‌లో వ‌దిలేసి పెళ్లి రిసెప్ష‌న్ కి వెళ్లాడు. అక్క‌డ త‌న డ్యాన్సింగ్ షోని పూర్తి చేసి తిరిగి సెట్లో షూట్ లో చేరాడు. ఈ మొత్తం ఘ‌ట‌న‌ను అత‌డు చాలా సీక్రెట్ గా ఉంచ‌డం మ‌రొక ఎత్తు. ఇంత‌కీ ఈ న‌టుడు ఎవ‌రు? అంటే క‌చ్ఛితంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని న‌టుడు. అత‌డు ది గ్రేట్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్.

అత‌డు ఆ స‌మ‌యంలో `ముజ్సే షాదీ కరోగి` సినిమా షూటింగ్ నుంచి స్కిప్ కొట్టాడు. అత‌డు వెళ్లిన‌ట్టు కూడా ఎవ‌రికీ తెలీదు. కానీ ప‌ని పూర్తి చేసుకుని తిరిగి టీమ్‌తో చేరిపోయ‌డు. అయితే అత‌డు ఎందుకు అలా వెళ్లాడు? అంటే... కేవ‌లం డ‌బ్బు సంపాద‌న కోసం. అయినా డ‌బ్బంటే చేదా? .. కేవ‌లం కొన్ని నిమిషాల ప్ర‌ద‌ర్శ‌న కోసం 20ల‌క్ష‌లు సంపాదించే అవ‌కాశం. లాభదాయకమైన పెళ్లి కార్యక్రమం కోసం ఖిలాడీ మ‌ధ్య‌లోనే సెట్ నుంచి జంప్ చేసాడు. పెళ్లికి వెళ్లాడు. అక్క‌డ‌ చిన్న‌ ప్రదర్శన కోసం అతడు రూ.20 లక్షలు సంపాదించాడు. ఈ విష‌యాన్ని `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో`లో అత‌డు వెల్లడించాడు.

అసలు సెట్ నుంచి వెళుతున్న‌ట్టు కూడా ఎవ‌రికీ తెలియ‌కుండా ఎలా మ్యానేజ్ చేసాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. గాళ్ ఫ్రెండ్ కోసం గోడ దూకిన‌ ప్రేమికుడిలా అత‌డు సెట్ నుంచి ర‌హ‌స్యంగా జంప్ చేసాడు. ఎవరికైనా తెలిసే లోపే తిరిగి సెట్‌కి వచ్చేయ‌డం మ‌రొక ట్విస్టు.

ఆ రోజు సెట్లో ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ కూడా సెట్లోనే ఉన్నాడు. అక్షయ్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసాడు. ఇత‌రుల‌కు తెలియ‌కుండా అత‌డు ఫరాకు ఆరోగ్యం బాగోలేదని విరామం అవసరమని చెప్పాడు. అత‌డి సెక్యూరిటీ గార్డు మోటార్ సైకిల్‌తో సిద్ధంగా ఉన్నాడు. అక్షయ్ దానిపైనే పెళ్లికి వెళ్లాడు.. ప్రదర్శన ఇచ్చాడు.. తనకు రావాల్సిన‌ చెక్కును తీసుకున్నాడు.. సెట్‌లో ఎవరికీ అనుమానం లేకుండా సినిమా సెట్‌కి తిరిగి వచ్చాడు.

ఇప్పుడు క‌పిల్ శ‌ర్మ షోలో చిరునవ్వుతో నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఒక సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి నుంచి సినీరంగంలో ప్ర‌వేశించిన అక్ష‌య్ కుమార్ ఇన్నేళ్ల‌లో ఏకంగా 2700 కోట్లు సంపాదించాడు. అక్షయ్ తాజా చిత్రం `జాలీ ఎల్‌ఎల్‌బి 3` ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ప్ర‌స్తుతం వ‌రుస‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వంలో `హైవాన్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. బూత్ బంగ్లా, హేరాఫేరి 3 సినిమాల్లోను న‌టించనున్నాడు.

Tags:    

Similar News