• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అఖండ 2' తాండవం సాంగ్...

'అఖండ 2' తాండవం సాంగ్ ప్రోమో.. పూనకాలు వచ్చేలా థమన్ ప్లాన్

| 'అఖండ'.. ఈ పేరు వింటేనే మాస్ ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా థమన్ ఇచ్చిన ఆ బీజీఎం ఇప్పటికీ సోషల్ మీడియాలో మోగుతూనే ఉంటుంది.

By - M Prashanth
Update: 2025-11-07 15:54 GMT

'అఖండ'.. ఈ పేరు వింటేనే మాస్ ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా థమన్ ఇచ్చిన ఆ బీజీఎం ఇప్పటికీ సోషల్ మీడియాలో మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పూనకం లోడింగ్‌ను డబుల్ చేసేందుకు బాలకృష్ణ బోయపాటి కాంబో 'అఖండ 2'తో రెడీ అయింది. ఈ సీక్వెల్ నుంచి ఫస్ట్ మ్యూజికల్ అప్‌డేట్ వచ్చేసింది. "అఖండ తాండవం" అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ వదిలారు.




ఈ ప్రోమోతోనే థమన్ "మ్యూజికల్ స్ట్రామ్" మొదలుపెట్టేశాడు. విజువల్స్ చూస్తే, మంచు కొండలు, పురాతన ఆలయాల మధ్య బాలయ్య అఘోరా గెటప్‌లో నడుస్తూ, ఢమరుకంతో ఇంటెన్స్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఆ బ్యాక్‌డ్రాప్‌లో "హర హర మహాదేవ్.. ఓం నమః శివాయ" అనే సౌండ్, హెవీ డ్రమ్ బీట్స్.. ఫస్ట్ పార్ట్‌ను మించిపోయే వైబ్ ఇస్తున్నాయి.

ఈసారి థమన్ వేసిన స్కెచ్ మామూలుగా లేదు. ఈ ఒక్క "తాండవం" పాట కోసం ఏకంగా ఇద్దరు మ్యూజికల్ లెజెండ్స్‌ను రంగంలోకి దించాడు. పవర్‌ఫుల్ వాయిస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన శంకర్ మహదేవన్, దేవుడి పాటలకు పెట్టింది పేరైన కైలాష్ ఖేర్.. ఈ ఇద్దరూ కలిసి ఈ పాటకు గొంతు కలిపారు. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడమే ఒక పెద్ద హైలైట్.

ప్రోమోలో వినిపించిన బీట్స్, ఆ ఇద్దరి వాయిస్ పవర్.. బోయపాటి మార్క్ ఎలివేషన్ సీన్స్‌కు, బాలయ్య అఘోరా గెటప్‌కు ఏ రేంజ్‌లో సెట్ అవుతాయో శాంపిల్ చూపించారు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్ కూడా ఈ పాటకు అదనపు బలం కానున్నాయి.

ఈ ప్రోమోతోనే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. "థియేటర్ల స్పీకర్లు బద్దలవ్వడం ఖాయం," "ఇది పాట కాదు, ఒక పూనకం" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నందమూరి ఫ్యాన్స్ ఈ మ్యూజికల్ బ్లాస్ట్ కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పనిలేదు.

ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌ను షేక్ చేస్తుండగా, ఫుల్ లిరికల్ సాంగ్‌ను నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఇక అసలు సినిమా 'అఖండ 2', డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈసారి రచ్చ డబుల్ అని ఫిక్స్ అవ్వొచ్చు.


Full View


Tags:    
  • akhanda2 
  • nandamuribalakrishna 
  • boyapatisreenu 
  • thaman 
  • thaanndavamfirstsingle 

Similar News

ఏడాది గడిచినా తగ్గని దుఖం!

2026-11-24 12:48 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి డాడ్ బూస్టింగ్!

2026-11-24 12:45 GMT

'ఆప‌రేష‌న్ సింధూర్' స‌మ‌యంలో భార‌త‌దేశానికి తెలియ‌ని భ‌యంక‌ర నిజం!

2026-11-24 12:40 GMT

అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?

2026-11-24 12:39 GMT

అలీతో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.. జుబేదా షాకింగ్ కామెంట్స్!

2026-11-24 12:36 GMT

నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి!

2026-11-24 10:23 GMT

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

Copyright @2026

Powered by Blink CMS