అఖండ 2 బిజినెస్ మానియా.. బాలయ్యకు తొలి రికార్డ్!
ఇక లేటెస్ట్ బిజినెస్ అప్‌డేట్ మరింత ఆసక్తికరంగా మారింది. అఖండ 2 సినిమాకి ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్‌లోనే అతిపెద్ద థియేట్రికల్ బిజినెస్ నమోదు అయ్యింది.;

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఫ్యాన్స్‌కి పండుగ. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలతో ఈ కాంబో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇప్పుడు అదే సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తూ ‘అఖండ 2: తాండవం’ రూపొందుతోంది. గతంలో ఓ అఘోరా పాత్రతో మాస్‌లో సాలీడ్ హైప్ తీసుకువచ్చిన బాలయ్య.. ఇప్పుడు మరింత శక్తివంతమైన అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈసారి యాక్షన్, ఎమోషన్, భక్తి, తాత్వికత అన్నీ మిక్స్ చేసిన కథతో బాలయ్య మరోసారి స్క్రీన్‌పై తన పవర్ చూపించబోతున్నారు. బోయపాటి మార్క్ మాస్ విజువల్స్‌కి బాలయ్య ఎనర్జీ దన్నుగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తవ్వగా, ఇటీవల మరో కీలకమైన షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ఆగస్ట్ వరకు కొనసాగనుంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలోని క్లైమాక్స్ అద్భుతంగా తెరకెక్కబోతుందని టీమ్ అంతా ధీమాగా ఉంది.
ఇక లేటెస్ట్ బిజినెస్ అప్‌డేట్ మరింత ఆసక్తికరంగా మారింది. అఖండ 2 సినిమాకి ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్‌లోనే అతిపెద్ద థియేట్రికల్ బిజినెస్ నమోదు అయ్యింది. వేరియస్ వేరియస్ మార్కెట్లలో కలిపి ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సాధించిందట. ప్రత్యేకంగా చెప్పాలంటే, తెలుగులో మాత్రమే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.120 కోట్ల మార్క్‌ను దాటి వెళ్ళనున్నట్లు ట్రేడ్ టాక్. గతంలో బాలయ్య సినిమాలకు ఇంత భారీ బిజినెస్ జరగలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల అఖండ 2 టీజర్ కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు మరింత బూస్ట్ ఇచ్చింది. బాలయ్య శివ తాండవం మూడ్‌లో కనిపించగా, త్రిశూలం తో యాక్షన్ సీన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ బాలయ్య మాస్ ఇమేజ్‌ను మరోసారి రీకాల్ చేసేలా ఉంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
థమన్ సంగీతం, సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, సంయుక్త మీనన్ హీరోయిన్ పాత్రలు కూడా హైలైట్ కానున్నాయి. ఆది పినిశెట్టి విలన్‌గా మెప్పించబోతున్నాడు. బోయపాటి మాస్ టెంప్లేటులో వస్తున్న ఈ చిత్రం థియేటర్స్‌లో మళ్లీ బాలయ్య మ్యాజిక్ చూపించనుందని ఫ్యాన్స్ ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు. ఇక బిజినెస్ పరంగా సినిమా ఇంకా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.