అకీరా హైట్ వెనుక అసలు సీక్రెట్

సెలబ్రిటీల పిల్లలు ఏం తింటారు? వాళ్లు అంత ఫిట్‌గా ఎలా ఉంటారు? అనే విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి.;

Update: 2026-04-24 16:30 GMT

సెలబ్రిటీల పిల్లలు ఏం తింటారు? వాళ్లు అంత ఫిట్‌గా ఎలా ఉంటారు? అనే విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, కూతురు ఆధ్యల గురించి ఏదైనా చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. ఈ మధ్య అకీరా తన తండ్రి కంటే పొడవుగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే రేణూ దేశాయ్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పిల్లల పెంపకం విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు వింటుంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అసలు విషయం ఏంటంటే, అకీరా ఇప్పటికే 6.4 అడుగుల ఎత్తు పెరగగా, ఆధ్య 5.11 అడుగుల ఎత్తులో ఉంది. వారి ఫ్యామిలీలో హైట్ అనేది కామన్ అయినా ఇంకాస్త ఎక్కువగా ఇంత హైట్ ఎలా సాధ్యమనే డౌట్ చాలా మందికి వచ్చింది. దీనిపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. పిల్లలకి తాను నాన్‌వెజ్ పెట్టలేదని చెప్పారు.

సాధారణంగా పిల్లలు బలంగా, ఎత్తుగా పెరగాలంటే నాన్‌వెజ్ తప్పనిసరని, అది పెట్టకపోతే పిల్లలు ఎదుగుదల సరిగ్గా ఉండదని చాలామంది ఆమెను టెన్షన్ పెట్టారట. కానీ ఆమె మాత్రం ఎవరి మాట వినకుండా కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఇచ్చి వాళ్లను ఇంత హెల్తీగా పెంచారు. పిల్లల డైట్ గురించి మరిన్ని విశేషాలు చెబుతూ.. తాను కేవలం ఇంటి తిండికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. బయట దొరికే జంక్ ఫుడ్ కాకుండా ఫ్రెష్ కూరగాయలతో వండిన వంటలే పిల్లలకు పెడతారట.

వీటికి తోడు మన సంప్రదాయ ఆయుర్వేదంలోని శతావరి, అశ్వగంధ వంటివి కూడా వాళ్ల ఆహారంలో భాగంగా ఉన్నాయని ఆమె వెల్లడించారు. అంటే ఖరీదైన డైట్లు, విదేశీ ఫుడ్స్ లేకపోయినా మన ఇంటి ఆహారంతోనే పిల్లలను స్ట్రాంగ్‌గా పెంచొచ్చని ఆమె నిరూపించారు. ఈ స్టేట్‌మెంట్ ఇప్పుడు పేరెంటింగ్ మీద ఉన్న చాలా అపోహలను తొలగిస్తోందని చెప్పవచ్చు. నాన్‌వెజ్ తింటేనే కండలు తిరుగుతాయి, ఎత్తు పెరుగుతారు అనే మైండ్‌సెట్‌ని రేణూ దేశాయ్ బ్రేక్ చేశారు.

సెలబ్రిటీ హోదాలో ఉన్నా చాలా సింపుల్ లైఫ్‌స్టైల్ ఫాలో అవుతూ పిల్లల్ని పెంచుతున్న తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అకీరా ఇప్పటికే హీరో మెటీరియల్‌లా ఉన్నాడని, ఇక సినిమాల్లోకి రావడమే ఆలస్యమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆధ్య కూడా మంచి హైట్‌తో ఉండటంతో వీరిద్దరి ఫ్యూచర్ గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఏదేమైనా రేణూ దేశాయ్ పిల్లల పెంపకం విషయంలో చాలా స్పష్టతతో ఉన్నట్లు కనిపిస్తోంది. కేవలం వెజ్ డైట్‌తోనే 6.4 అడుగుల ఎత్తు అంటే మామూలు విషయం కాదు. సోషల్ మీడియాలో అకీరా నందన్ పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. బాబు సినిమాల్లోకి వస్తే ఈ హైట్‌కి ఏ హీరోయిన్ సెట్ అవుతుందో అని అభిమానులు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.

Tags:    

Similar News