'ఆడిషన్ పేరుతో పిలిచి అలా చేశారు'.. హీరోయిన్ సంచలన ఆరోపణలు
అజ్మల్ అమీర్ పై వ్యతిరేకంగా మాట్లాడిన ఫస్ట్ పర్సన్ ను తానే కావచ్చని తెలిపారు నటి నర్విని. గతంలో ఓ ఇంటర్వ్యూలో దురాగతాల గురించి వెల్లడించానని చెప్పారు.;
కోలీవుడ్ హీరో అజ్మల్ అమీర్ ను వివాదాలు చుట్టు ముడుతున్నాయనే చెప్పాలి. రంగం మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరైన ఆయన.. ఆ తర్వాత రచ్చ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కానీ కొంతకాలంగా మాత్రం తమిళంలోనే సినిమాలు చేస్తున్న అజ్మల్ అమీర్ పేరు.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
కొందరు అమ్మాయిలతో అజ్మల్ అమీర్ అసభ్యంగా మాట్లాడారని రీసెంట్ గా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ ఆడియో క్లిప్ కూడా నెట్టింట వైరల్ అయింది. కానీ ఆ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అని అన్నారు. తన కెరీర్ ను నాశనం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
అది జరిగిన కొద్ది రోజులకు.. ఇప్పుడు అజ్మల్ అమీర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కోలీవుడ్ నటి నర్విని దేరి తాజాగా మీడియా ముందుకు వచ్చి.. ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో కోలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
అజ్మల్ అమీర్ పై వ్యతిరేకంగా మాట్లాడిన ఫస్ట్ పర్సన్ ను తానే కావచ్చని తెలిపారు నటి నర్విని. గతంలో ఓ ఇంటర్వ్యూలో దురాగతాల గురించి వెల్లడించానని చెప్పారు. 2018లో చెన్నైలోని అజ్మల్ ను తొలిసారి కలిశానని, ఆ సమయంలో తన తర్వాత సినిమాకు హీరోయిన్ కావాలని చెప్పి ఫోన్ నంబర్ తీసుకున్నారని అన్నారు.
ఆ తర్వాత మరుసటి రోజు ఆడిషన్ కు రమ్మని పిలవగా, అక్కడికి వెళ్లాక వాతావరణం తేడాగా అనిపించిందని చెప్పారు. ఆ సమయంలో రూమ్ లో ఆయన ఒక్కరే ఉన్నారని, అంతా బయటకు వెళ్లారని తెలిపారు. దీంతో ఏదో తప్పు జరగబోతోందని అర్థమైందని, మాటల మధ్యలో చేయి పట్టుకుని డ్యాన్స్ చేద్దామని అడిగినట్లు పేర్కొన్నారు.
అప్పుడు ఆయన ఉద్దేశం అర్థమైందని, తాను ఆ విషయం కోసం రాలేదని క్లారిటీ ఇచ్చినట్లు చెప్పారు నర్విని. దీంతో తన వెనకాల ఎంతో మంది అమ్మాయిలు పడతారంటూ గొప్పలు చెప్పారని అన్నారు. లక్కీగా అజ్మల్ అమీర్ కు అప్పుడే ఓ ఫోన్ కాల్ రావడంతో తాను అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డానని చెప్పారు.
అయితే తాను అప్పుడు చదువు, కెరీర్ పై ఫోకస్ చేయాల్సి వచ్చిందని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని నర్విని తెలిపారు. కానీ ఇప్పుడు ఆయన కోసం అందరికీ తెలియాలని.. అందుకే ఓపెన్ అయ్యానని చెప్పారు. ఘటన తర్వాత కూడా పలుమార్లు మెసేజ్ చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు అజ్మల్ స్పందిస్తారేమో వేచి చూడాలి.