కేన్స్ 2025లో ఐష్ గీతా శ్లోకం ప్ర‌ద‌ర్శ‌న‌!

కేన్స్ 2025 ఉత్స‌వాల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ‌రుస‌గా రెండో రోజు రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ రెండవ షో కేవలం ఫ్యాషన్ ఎలివేష‌న్ కోసం ఉద్ధేశించిన‌ది మాత్ర‌మే కాదు.. ఇది గీతా సారాన్ని నేర్పించే ఆధ్యాత్మిక ప్రతిబింబం.;

Update: 2025-05-23 10:47 GMT
కేన్స్ 2025లో ఐష్ గీతా శ్లోకం ప్ర‌ద‌ర్శ‌న‌!

కేన్స్ 2025 ఉత్స‌వాల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ‌రుస‌గా రెండో రోజు రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ రెండవ షో కేవలం ఫ్యాషన్ ఎలివేష‌న్ కోసం ఉద్ధేశించిన‌ది మాత్ర‌మే కాదు.. ఇది గీతా సారాన్ని నేర్పించే ఆధ్యాత్మిక ప్రతిబింబం. లోరియల్ పారిస్ ప్ర‌చార‌క‌ర్త‌గా ఐశ్వ‌ర్యారాయ్ కేన్స్ ఉత్స‌వాల‌లో సంద‌డి చేసారు.

ఈసారి బ్లాక్ ఆఫ్-షోల్డర్ సీక్విన్డ్ గౌన్ .. లేత గోధుమరంగు ఆకృతి గల కేప్ ధ‌రించి భార‌తీయ‌త‌ను మ‌రోసారి ప్ర‌పంచ ఫ్యాష‌న్ య‌వ‌నిక‌పై ఆవిష్క‌రించారు. హాలీవుడ్ దిగ్గజాలు హెలెన్ మిర్రెన్ - కారా డెలివింగ్నేతో ఫోటోలకు పోజులిస్తుండగా ఒక చిన్న ప్రమాదం కూడా జరిగింది. హెలెన్ అనుకోకుండా ఐశ్వర్యరాయ్ బెనార‌సి కేప్ శాలువాపై అడుగు వేసారు. ఆ స‌మ‌యంలో తన సిగ్నేచర్ చిరునవ్వుతో ఐష్ దానిని స‌రి చేసారు. మిర్రెన్‌తో స‌ర‌దాగా మాట్లాడేస్తూ క‌నిపించారు. మిర్రెన్ వెంట‌నే జ‌రిగిన దానికి క్షమాపణ చెప్పారు.

అయితే జ‌రిగిన ఇన్సిడెంట్ కార‌ణంగా ఇక్క‌డ ఒక విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఐష్ త‌న త‌ల‌మీదుగా ధ‌రించిన కేప్ పై భ‌గ‌వ‌ద్గీత నుంచి విజ్ఞాన‌దాయ‌క‌మైన‌, స్ఫూర్తి దాయ‌క‌మైన లైన్ రాసి ఉండ‌టం క‌నిపించింది. ``మీ ప‌ని మీరు చేయండి.. ఫలితాన్ని మర్చిపోండి`` అనే భ‌గ‌వ‌ద్గీత నుంచి శక్తివంతమైన సందేశాన్ని శాలువాపై ముద్రించి ఉండ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

ఈ దుస్తుల‌ను గౌరవ్ గుప్తా రూపొందించారు. ఆఫ్-షోల్డర్, శిల్పకళా బ్లాక్ వెల్వెట్ గౌను డిజైన్ కోసం విశ్వంలోని రహస్యాలను పోలి ఉండేలా ఎంబ్రాయిడరీని జోడించారు. బంగారం, వెండి, బొగ్గు, అర్ధరాత్రి న‌లుపు దారాల సుడిగుండాలు నక్షత్రాల్లా క‌నిపించాయి. గీత నుంచి సంస్కృత శ్లోకాన్ని రెడ్ కార్పెట్ పై ప్ర‌ద‌ర్శిండం వెన‌క ఒక‌ అర్థం ఉంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేవలం గౌను ధరించలేదు,... ఒక తత్వశాస్త్రాన్ని త‌న‌తో తెచ్చారు. కేన్స్ 2025లో ఇది మ‌ర‌పురాని జ్ఞాప‌కంగా మిగిలింది. కేన్స్ 2025 లో మొద‌టిసారి రెడ్ కార్పెట్ పై న‌డిచిన‌ప్పుడు ఐశ్వ‌ర్యారాయ్ నుదిటిన సింధూరం ధ‌రించి క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉగ్ర కుట్ర‌ల పాకిస్తాన్ పై ఇండియా ఎటాక్స్, గెలుపు నేప‌థ్యాన్ని కేన్స్ 2025లో ఇది హైలైట్ చేసింది. ఐష్ రెండుసార్లు రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో భార‌తీయ‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డం హైలైట్.

Tags:    

Similar News