పిక్‌టాక్ : పొట్టి నిక్కర్‌లో అందాల ఐశ్వర్య
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3.3 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న ఈ అమ్మడు షేర్ చేసే ప్రతి ఫోటో షూట్ వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.;
స్పై, భజే వాయు వేగమ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్. గత ఏడాదిలో ఈమె నటించి మలయాళ మూవీ బాజూకా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా లక్ కలిసి రాకపోవడంతో కమర్షియల్ బ్రేక్ దక్కించుకోలేక పోయింది. అయితే సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలు, వీడియోల కారణంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ, వైరల్ అవుతూ వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3.3 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న ఈ అమ్మడు షేర్ చేసే ప్రతి ఫోటో షూట్ వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ తమిళ ముద్దుగుమ్మ 2012లో కాదలిల్ సోదప్పువదు యెప్పడి అనే తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు దక్కనప్పటికీ 2013లో ఏకంగా మూడు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. హీరోయిన్‌గా మెల్ల మెల్లగా కెరీర్‌లో అడుగులు వేస్తూ కేవలం తమిళ్‌లో మాత్రమే కాకుండా కన్నడం, మలయాళం, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈమె వరుసగా తెలుగు సినిమాలు చేయడంతో టాలీవుడ్‌లో కచ్చితంగా పాపులర్ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ తెలుగులో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడం తో మళ్లీ తెలుగు ఆఫర్లు రాలేదు.
గత ఏడాది మలయాళ సినిమా బజూకాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత చేసిన సినిమాలు ఏమీ లేవు. ఈ ఏడాది ఈమె నుంచి సినిమా వచ్చేది... రానిది ఇంకా క్లారిటీ రాలేదు. టాలీవుడ్‌లో ఈ అమ్మడు కొత్తగా సినిమాలు ఏమీ చేయడం లేదు. అయితే తమిళ, మలయాళంలో మాత్రం సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే అవి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. కన్నడ సినిమా పరిశ్రమలో ఈ అమ్మడు చేసిన రెండు సినిమాలు మంచి గుర్తింపు తెచ్చి పెట్టినా అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ముందు ముందు అయినా ఈమె వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా ఈమె షేర్ చేసే అందమైన ఫోటోల కారణంగా ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈమె పొట్టి నిక్కర్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ఈ అమ్మడి థైస్ అందంతో చూపు తిప్పనివ్వడం లేదు. నడుము అందం చూపిస్తూ కవ్విస్తున్న ఐశ్వర్య మీనన్ అందాల ఆరబోత ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో ఫాలోవర్స్ పెరుగుతూ వస్తున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉన్న ఐశ్వర్య మీనన్ లక్ కలిసి రాకపోవడంతో ఆఫర్లు ఆశించిన స్థాయిలో దక్కడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు దశాబ్ద కాలం అయిన ఈ అమ్మడు ఇంకా బ్రేక్ దక్కలేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.