పిక్‌టాక్‌ : బాలి ట్రిప్‌లో అందాల ముద్దుగుమ్మ

హీరోల వారసులు హీరోలుగా, హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు, దర్శక నిర్మాతల వారసులు సైతం హీరోలుగా, దర్శక నిర్మాతలుగా, హీరోయిన్స్‌గానూ పరిచయం అయిన విషయం తెల్సిందే;

Update: 2025-05-21 22:30 GMT

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు ఉన్నారు. హీరోల వారసులు హీరోలుగా, హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు, దర్శక నిర్మాతల వారసులు సైతం హీరోలుగా, దర్శక నిర్మాతలుగా, హీరోయిన్స్‌గానూ పరిచయం అయిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీలో చాలా అరుదుగా హీరోయిన్స్ వారసులు కనిపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ వారసులు అంటే వారి పిల్లలు మాత్రమే కాకుండా సిస్టర్స్‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్‌లో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ సిస్టర్స్‌ను పరిచయం చేసిన విషయం తెల్సిందే. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన నేహా శర్మ తన సోదరి ఐషా శర్మను అభిమానులకు పరిచయం చేసింది.

రామ్ చరణ్‌తో చిరుత సినిమాలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు దక్కించుకుంది. అంతే కాకుండా ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్‌ను చాలా మంది అభిమానించారు. రామ్‌ చరణ్‌ స్థాయిలో కాకున్నా కచ్చితంగా మంచి నటిగా నేహా శర్మ బిజీ కావడం ఖాయం అనే ధీమాను అప్పట్లోనే అంతా వ్యక్తం చేశారు. చిరుత విజయం సొంతం చేసుకున్నా నేహా శర్మ తప్పుడు ఎంపికల కారణంగా ఆశించిన స్థాయిలో స్టార్‌డం దక్కించుకోలేక పోయింది. దాంతో మెల్ల మెల్లగా టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గాయి. అయితే లక్కీగా ఈ అమ్మడు బాలీవుడ్‌లో అడుగు పెట్టి అక్కడ సినిమాలు చేస్తుంది.

నేహా శర్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అవుతున్నా ఇంకా హిందీ సినిమాలతో కొనసాగుతూ తన అందమైన ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇలాంటి నేహా శర్మ సోదరి ఐషా శర్మ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అక్కకు ఏమాత్రం తగ్గకుండా ఐషా అందంగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్స్‌కి తగ్గకుండా ఐషా అందాలకు అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఈమెకు చాలా సినిమా ఆఫర్లు వచ్చి ఉంటాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తుందేమో ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కమిట్‌ కాలేదు.

తాజాగా మరోసారి బాలి టూర్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం ద్వారా చూపు తిప్పుకోనివ్వలేదు. ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉన్న ఐషా ను వెండి తెరపై చూడాలని ఆశ పడుతున్నామని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఐషా మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌కే తన అందాన్ని పరిమితం చేసింది. తాజాగా షేర్ చేసిన కలర్‌ ఫోటోలు మరోసారి ఆమెను వార్తల్లో నిలిపాయి. సాధారణంగా హీరోయిన్స్కి మాత్రమే ఇంతటి పబ్లిసిటీ దక్కుతుంది. కానీ సినిమాల్లో పెద్దగా నటించకుండానే ఐషా అందమైన ఫోటోలకు ఈ స్థాయిలో పబ్లిసిటీ దక్కడం ఆశ్చర్యంగా ఉందంటూ మీడియా వర్గాల వారు కామెంట్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News