ఇండస్ట్రీలో శంకర్ కుమార్తె పుంజుకునేదెప్పుడు?
ఈ రంగంలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అందరికీ ఉంటుంది. కానీ సక్సెస్ అయ్యేది కొందరే. అందుకు అదృష్టం కూడా కలిసి రావాలి.;
ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె జర్నీ ఎలా సాగుతుంది? అదితి శంకర్ స్టార్ లీగ్ లో చేరడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? నాలుగేళ్ల ప్రయాణంలో నటిగా ఎంతవరకూ సక్సెస్ అయింది? అమ్మడి సక్సస్ గ్రాఫ్ ఎలా ఉంది? అంటే చాలా సంగతులు చర్చించాలి. సినిమా అంటే ఓ కల. ఈ రంగంలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అందరికీ ఉంటుంది. కానీ సక్సెస్ అయ్యేది కొందరే. అందుకు అదృష్టం కూడా కలిసి రావాలి.
మరి ఈ దశలో అదితి శంకర్ జర్నీ ఎలా ఉందో చూద్దాం. 'వీరుమాన్' తో అదితి శంకర్ సినిమా ప్రయాణం మొదలైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో ఆ సినిమా మంచి విజయం సాధించింది. అటుపై 'మావీరన్' లో ఛాన్స్ అందుకుంది. ఈసినిమా కూడా బాగానే ఆడింది. ఈ రెండు ఏడాది గ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి. అటుపై తమిళ్ లోనే 'నేసిప్పాయ' అనే సినిమాలో నటించింది. ఇది మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేదు.
సరిగ్గా ఇదే సమయంలో టాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది. అదే 'భైరవం'. అదితి హీరోయిన్ గా నటించిన తెలుగు సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. కానీ టాలీవుడ్ డెబ్యూ మాత్రం నిరాశనమే మిగిల్చింది. ఇందులో అదితి నటనపై విమర్శలే వ్యక్తమయ్యాయి. ఆ పాత్రకు ఏమాత్రం సూట్ కాలేదని రివ్యూల్లో తేలిపోయింది. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు పెయిర్ గా సెట్ అవ్వలేదని విమర్శలొచ్చాయి.
ఆ రకంగా నటిగా పాస్ మార్కులు కూడా వేయించుకోలేకపోయింది. ఇక అమ్మడి చేతిలో ఉన్నది ఒక్కటే చింతం. అదే ఒన్స్ మోర్. ఇది మినహా కొత్త ఛాన్సులేవి లేవు. అటు కోలీవుడ్ లో కూడా ఎలాంటి సినిమా లకు సంతకం చేయలేదు. నటిగా నాలుగేళ్లగా ఉన్న అమ్మడి కెరీర్ ఇంకా నత్త నడకకే సాగుతుంది. ఇలా గైతే కొత్త భామల పోటీని తట్టుకుని నిలబడటం కష్టమనే అంటున్నారు. అదితి శంకర్ స్టైల్ మార్చి కొత్త తరహా కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల్ని ఆకర్షిస్తే తప్ప నిలబడటం కష్టమనే ఫీడ్ బ్యాక్ వస్తుంది. మరి ఆ మార్పు కోరకు డాడ్ సహాయం చేస్తారా? అంటే ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉండదు.