శృతి హాసన్ కి గోతులు తీసేవారు ఎవరబ్బా?
ఒక స్టార్ కిడ్ గా కాకుండా సొంతంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్.;
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతురు అయినా కూడా ఒక స్టార్ కిడ్ గా కాకుండా సొంతంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్. బాలీవుడ్ లో తన అదృష్టంను పరీక్షించుకున్న శృతి హాసన్ తెలుగు లో గబ్బర్ సింగ్ తో మొదటి విజయాన్ని సొంతం చేసుకుని అక్కడ నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఈ మధ్య కాలంలో హిందీ సినిమా లు మరియు సిరీస్ లతో పాటు తమిళం ఇంకా తెలుగు భాషల సినిమాల్లో నటిస్తూ దూసుకు పోతుంది. హీరోయిన్ గా ఈమె స్థాయి ఏ రేంజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమా ల్లో నటించి మెప్పించింది.
ఈ మధ్య కాలంలో ఈమె రెగ్యులర్ గా తన ప్రియుడు శాంతను గురించి పోస్ట్ లు చేస్తూ ఉండేది. కానీ తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్ట్ లో... ఈ మధ్య కాలంలో నేను కొందరిని గమనిస్తున్నాను. వాళ్లు గోతులు తీస్తున్నారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే వారు తీసిన గోతిలో వాళ్లే పడుతారు. అందుకే నేను ప్రస్తుతానికి వారిని చూసి మౌనంగా ఉన్నాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కర్మ వాళ్లకు శిక్ష ను ఖరారు చేస్తుందని నమ్ముతున్నాను అంటూ పోస్ట్ చేసింది.
ఉన్నట్లుండి శృతి హాసన్ ఇలాంటి పోస్ట్ ను షేర్ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అంటూ అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారు. శృతి హాసన్ వెనుక గోతులు తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. ఇంతకు శృతి అంతగా కర్మ ను నమ్ముతుందా అంటూ ఆమె అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.