యూట్యూబర్ తో లేడీ సూపర్ స్టార్.. ఇప్పుడు అవసరమా?
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల బాలీవుడ్ లో నటించిన జవాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.;
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల బాలీవుడ్ లో నటించిన జవాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జవాన్ సినిమా తర్వాత నయనతార కి బాలీవుడ్ లో కూడా ఫుల్ డిమాండ్ పెరిగింది. కానీ అక్కడ ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేయాలని ఆమె కోరుకోవడం లేదట. పెద్ద హీరోలు, ప్రముఖ నిర్మాతల సినిమాలకు కూడా నయన్ నో చెబుతుందట.
ఇలాంటి సమయంలో ఆమె తమిళ్ లో కొత్తగా ఓకే చేసిన సినిమా అందరికీ షాకింగ్ గా ఉంది. ఒక వైపు వందల కోట్ల భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తుండగా నయనతార మాత్రం చిన్న సినిమాల్లో, అది కూడా కొత్త దర్శకుడితో వర్క్ చేసేందుకు సిద్ధం అవ్వడం తమిళ్ మీడియా వర్గాల వారిని మాత్రమే కాకుండా ఆమె అభిమానులను కూడా సర్ ప్రైజ్ కి గురి చేసింది అనడంలో సందేహం లేదు.
తాజాగా డ్యూడ్ విక్కీ దర్శకత్వంలో నయనతార సినిమాను చేసేందుకు కమిట్ అయింది. తమిళ్ యూట్యూబ్ ప్రేక్షకులకు డ్యూడ్ విక్కీ సుపరిచితుడు. అతడు ఇప్పటి వరకు సినిమా లకు దర్శకత్వం వహించిందే లేదు. మొదటి సారి నయనతార సినిమా తో వెండి తెరపై దర్శకుడిగా తెరంగేట్రం చేసేందుకు సిద్ధం అయ్యాడు.
సినిమాల అనుభవం లేని డ్యూడ్ విక్కీ కి నయనతార ఛాన్స్ ఇవ్వడం ను కొందరు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఇలాంటి సమయంలో నయనతార ప్రయోగాలు చేయడం ఎంత వరకు సబబు అంటున్నారు. మొత్తానికి నయనతార కొత్త సినిమాకు సంబంధించిన హడావుడి సందడి ప్రస్తుతం తమిళ్ మీడియాలో కనిపిస్తుంది.
తాజాగా విడుదల అయిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. న్యాయ దేవత విగ్రహం ను చూపించడం వల్ల ఈ సినిమా న్యాయ వ్యవస్థకు సంబంధించినది అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా నయనతార సినిమా అనగానే ఆమె అభిమానులతో పాటు చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వారికి ఎలాంటి ఫీల్ ను కలిగిస్తుందో చూడాలి.