ఆ యంగ్‌ హీరో నిర్ణయం సరైనదేనా?

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోలు సక్సెస్‌ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు హీరోగా నిలదొక్కుకోవాలంటే రెండింతలు కష్టపడాల్సిందే.;

Update: 2026-03-31 09:30 GMT

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోలు సక్సెస్‌ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు హీరోగా నిలదొక్కుకోవాలంటే రెండింతలు కష్టపడాల్సిందే. కథ ఎంపిక చేసుకున్నది మొదలుకుని ఫైనల్‌ కాపీ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు హీరోలు మంచి కథ ఎంపిక చేసుకున్నామా.. నటించామా.. అన్నట్లుగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా ఉంటే ఫలితాలు బెడిసి కొడుతున్నాయి. అందుకే మొదటగా తమ వద్దకు వచ్చిన కథలను సొంత టీమ్‌ తో చర్చించి, అందులో ఏమైనా మార్పులు చేయించి, దర్శకుడికి ఇస్తున్నారు. దర్శకుడికి కూడా పూర్తిగా ఫ్రీ హ్యాండ్‌ ఇస్తారా అంటే అది కూడా లేదు. పైగా మేకింగ్‌ విషయంలో కొందరు హీరోల ఇన్వాల్వ్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు. సిద్దు, నవీన్ వంటి యంగ్‌ హీరోలు కథ విషయంలో చాలా డీప్‌గానే ఇన్వాల్వ్‌ అవుతున్నారు. స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం విషయంలోనూ వారి నిర్ణయాలకు గౌరవం దక్కుతుంది అనేది ఇండస్ట్రీలో టాక్‌.

దర్శకత్వంపై కిరణ్ అబ్బవరం...

యంగ్‌ హీరోలు అతి జాగ్రత్తతో కొన్ని సార్లు పొరపాటు చేస్తున్నారు అనేది కొందరి అభిప్రాయం. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం విషయంలో కొన్ని సార్లు తారు మారు అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు దర్శకులు చెప్పినట్లుగా చేస్తూ వచ్చిన యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం రూటు మార్చాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తనకు దర్శకత్వం పై ఉన్న పట్టును తదుపరి సినిమాలపై చూపించేందుకు ఆయన రెడీ అవుతున్నాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల ద్వారా వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల తర్వాత సొంత సినిమాను మొదలు పెట్టాలని కిరణ్ అబ్బవరం భావిస్తున్నాడట. అందుకు గాను రెండు మూడు కథలను ఫైనల్‌ చేసుకుని పెట్టుకున్నాడట. అందులో ఒక కథను స్వయంగా తానే డైరెక్ట్‌ చేయడం ద్వారా కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయానికి వచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.

నిర్మాణ సంస్థ ప్రారంభించిన హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఈ మధ్య కాలంలో కథల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, సన్నిహితులకు, కొత్త వారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి, తాము అనుకున్నట్లుగా సినిమాను చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కూడా అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని, సొంతంగా పూర్తిగా తానే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన కిరణ అబ్బవరం ఇప్పుడు ఏకంగా దర్శకత్వం చేసేందుకు రెడీ కావడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. కెరీర్‌ లో ఇంకా చాలా చూడాల్సిన కిరణ్ అబ్బవరం అప్పుడే దర్శకత్వం వైపు వెళ్లడం ఏంటో అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. కిరణ్ అబ్బవరం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సబబు అని ఆయన సన్నిహితుల్లోనే కొందరు చెవులు కొరుక్కుంటున్నారట.

చెన్నై లవ్‌ స్టోరీ సినిమాతో...

ఇతర హీరోలను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని కిరణ్‌ అబ్బవరం ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నవీన్‌ పొలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ షాడో డైరెక్షన్‌ చేస్తారేమో కానీ పూర్తి స్థాయిలో డైరెక్షన్‌ కార్డ్‌ వేయించుకోలేదు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం ఏకంగా డైరెక్షన్‌ కార్డ్‌ కోసం ప్రయత్నాలు చేయడం విడ్డూరంగా ఉందని కొందరు అంటున్నారు. ఇతర హీరోలతో పోల్చితే కిరణ్‌ అబ్బవరం కెరీర్‌ పరంగా చాలా బెటర్‌ పొజీషన్‌ లో ఉన్నాడని చెప్పాలి. అయినా కూడా ఇలాంటి సమయంలో ఇలాంటి యూటర్న్‌ నిర్ణయం తీసుకోవడం వల్ల కెరీర్‌ ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు కిరణ్‌ అబ్బవరం దర్శకత్వం చేస్తాడు అనేది పుకార్లు మాత్రమే.. ఆయన నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి కిరణ్‌ అబ్బవరం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలో మంచి సినిమాలతో కిరణ్‌ వస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా కిరణ్‌ అబ్బవరం ప్రస్తుతం చేస్తున్న చెన్నై లవ్‌ స్టోరీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తిమ్మరాజు పల్లి టీవీ కూడా ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తిని పెంచిన విషయం తెల్సిందే.

Tags:    

Similar News