తాతయ్య, తండ్రి బాటలో వారసుడు!
తాతయ్య రాకేష్ రోషన్, నాన్న హృతిక్ రోషన్ వారసత్వాన్ని గ్రాండ్ గా కొనసాగించే ప్రణాళిక సిద్దం చేస్తున్నాడా? అంటే అవుననే అనాలి.;
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కుటుంబం నుండి మరో వారసుడు తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడా? తాతయ్య రాకేష్ రోషన్, నాన్న హృతిక్ రోషన్ వారసత్వాన్ని గ్రాండ్ గా కొనసాగించే ప్రణాళిక సిద్దం చేస్తున్నాడా? అంటే అవుననే అనాలి. హృతిక్ రోషన్ చిన్న కుమారుడు 17 ఏళ్ల హృదాన్ రోషన్ అమెరికాలోని ప్రతిష్టాత్మక `యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లో ఫిలిం మేకింగ్ కోర్సులో చేరాడు. దీంతో తాత, తండ్రి అడుగు జాడల్లోనే హృదాన్ కూడా కొనసాగుతాడని తెలుస్తోంది. దీంతో రోషన్ కుటుంబ వారసత్వం సినీ పరిశ్రమలో మరో తరం ముందుకు కొనసాగుతుందని క్లారిటీ వచ్చేసింది.
రాకేష్ రోషన్ నటుడిగా, నిర్మాతగా , దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేశారు. అనంతరం హృతిక్ రోషన్ తన నటనతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. ఇప్పుడు హృతిక్ తనయుడు హృదాన్ ఫిలిం మేకింగ్‌ను ఒక వృత్తిగా ఎంచుకోవడం చూస్తుంటే హృదాన్ కూడా తండ్రిలాగే నటుడు, దర్శకుడిగా లేదా నిర్మాతగా రాణించాలనే ఆసక్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. హృదాన్ రోషన్ చదువుతోన్న అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబే ఈ విషయాన్ని అధికారికంగా
వెల్లడించింది. ఈ సందర్భంగా అభిమానులు , కుటుంబ సభ్యులు హృదాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హృతిక్ రోషన్ -సుసానే ఖాన్ విడాకులు తీసుకున్నప్పటికీ కుమారులైన హృహాన్ - హృదాన్ బాధ్యతలను ఎంతో బాధ్యతాయుతంగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లల చదువు - వారి కెరీర్ విషయంలో హృతిక్ ఎప్పుడూ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నారు. హృదాన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక తండ్రి హృతిక్ మద్దతు కూడా మెండుగా ఉందని తెలుస్తోంది. ప్రత్యేకించి తాతయ్య రాకేష్ రోషన్ మనవడిని ఇండస్ట్రీలో గొప్ప స్థానంలో చూడాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. హృదాన్ రోషన్ ఫిలిం మేకింగ్ కోర్సు పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత బాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
మరి హృదాన్ హీరో అవుతాడా? దర్శకుడు అవుతాడా? అన్నది అతడి నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో హృతిక్, రాకేష్ ల నుంచి పెద్దగా ఒత్తిడి ఉండదు. పూర్తి స్వేచ్చనిచ్చి పరిశ్రమలోకి ఆహ్వానిస్తారు. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. షారుక్ అభిమానులంతా ఆర్యన్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకుంటే దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టి షాక్ ఇచ్చాడు. ఈనేపథ్యంలో స్టార్ కిడ్స్ కెరీర్ విషయంలో నిర్ణయాలు ఎలా ఉంటాయి? అన్నది అప్పుడే చెప్పలేం.