ధురంధ‌రుడి పై తెలుగు డైరెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌!

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్ 2` ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.;

Update: 2026-03-31 11:28 GMT

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్ 2` ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. విడుద‌లైన 12 రోజుల్లోనే చాలా వ‌ర‌కు రికార్డుల్ని స‌మం చేస్తూ సంచ‌ల‌నాల దిశ‌గా పయ‌నిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1400 కోట్ల మైలురాయిని చేరుకుని ఫ‌స్ట్ పార్ట్ వ‌సూళ్ల‌ని క్రాస్ చేసింది. ఈ స్థాయి వ‌సూళ్ల‌తో `ధురంధ‌ర్ 2` అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఇండియ‌న్ సినిమాల్లో నాలుగ‌వ స్థానాన్ని సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో దీని స్పీడు చూస్తుంటే ఫ‌స్ట్ ప్లేస్‌కు చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఓ ప‌క్క వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్న ఈ సినిమాపై ప్రాప‌గాండ మూవీ అంటూ ప్ర‌చారం మొద‌లైంది. ప‌లువురు కోలీవుడ్ డైరెక్ట‌ర్లు ఈ సినిమాపై త‌మ అక్క‌సుని వెళ్ల‌గ‌క్కుతూ నెట్టింట విమర్శ‌ల‌కు గుర‌వుతున్నారు. సినిమా రిలీజ్ డే నుంచి టాలీవుడ్ స్టార్స్, స్టార్ డైరెక్ట‌ర్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ కూడా ప్ర‌శంస‌లు కురిపించినా వెట్రిమార‌న్‌, పా. రంజిత్ లాంటి ద‌ర్శ‌కులు మాత్రం ఈ సినిమాపై విషం చిమ్ముతూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

రీసెంట్‌గా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస‌క‌తూనే ప్రాప‌గాండ అంటూ ప్రచారం చేస్తున్న వారికి చుర‌క‌లు అంటించారు. అలాంటి వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదంటూ లైట్ తీసుకున్నారు. ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌తో పాటు హీరో ర‌ణ్ వీర్ సింగ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సినిమాని విమ‌ర్శించే వారి ఆత్మ‌లకు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నానంటూ వ్య‌గ్యాస్త్రాలు సంధించారు. దీంతో అనుప‌మ్ ఖేర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే తెలుగు స్టార్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా స్టోరీస్‌లో సినిమాపై స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. `ధురంధ‌ర్ 2` ప్రారంభంలో.., ముగింపులో ఆదిత్య‌ధ‌ర్ ప్ర‌తిభ ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తుంది. యాక్ష‌న్, పేళుళ్ల‌కు అతీతంగా త‌ల్లి కౌగిలి, ఆ కౌగిలి కోసం ప‌డే ఆరాటం మ‌న‌సును తాకుతాయి. ర‌ణ్‌వీర్ సింగ్ ఎప్పుడూ త‌న పాత్ర‌ల‌లో లీన‌మైపోతాడు.

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్ర‌మాణాల‌ను పెంచుతూనే ఉంటాడు. భార‌త దేశంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచినందుకు చిత్ర బృందానికి ప్ర‌త్యేక అభినంద‌న‌లు` అని షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఇన్ స్టా పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. నాగ్ అశ్విన్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో క‌ల్కి 2`ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌భాస్‌కు సంబంధం లేకుండా జ‌రిగే కీల‌క ఘ‌ట్టాల‌ను అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌ల‌పై చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌భాస్ కూడా ఈ షూట్‌లోకి ఎంట‌ర‌య్యాడు. పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉంటుంద‌ని, అస‌లు క‌థ అంతా ఇందులోనే ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News