రిలీజ్ డేట్ మార‌డం వ‌ల్ల 'పెద్ది' కి న‌ష్ట‌మేంటీ?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'.;

Update: 2026-03-31 11:09 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సినిమాపై అంచ‌నాల్ని పెంచేసి అభిమానుల్లో స‌రికొత్త జోష్‌ని నింపాయి. ముందు మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 'ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌' కార‌ణంగా వాయిదా వేశారు. ఫైన‌ల్‌గా ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

అయితే ఈ రోజున కూడా రావ‌డం లేద‌ని, జూన్‌కు వాయిదా ప‌డింద‌ని, జూన్ 26న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. రీసెంట్‌గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన `చెన్నై ల‌వ్ స్టోరీ` ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నిర్మాత ఎస్‌కెఎన్ పెద్ది రిలీజ్ డేట్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జూన్ 26న మా సినిమాని రిలీజ్ చేయాల‌నుకున్నామ‌ని, అయితే అదే రోజున `పెద్ది` రిలీజ్ ఉంద‌ని సాయి రాజేష్ చెప్పార‌ని, మా సినిమా రిలీజ్ డేట్‌ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని చెప్ప‌డంతో అస‌లు చ‌ర్చ మొద‌లైంది.

దీనిపై నెట్టింట చ‌ర్చ జ‌రుగుతున్న వేళ ఎస్‌కెఎన్ స్పందించారు. తాను పొర‌బ‌డ్డాన‌ని, `చెన్నై ల‌వ్‌స్టోరీ`ని ఎప్పుడు రిలీజ్ చేద్దాం` అని సాయి రాజేష్ అడిగితే `పెద్ది`ని జూన్ 26న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ట్వీట్‌లు క‌నిపిస్తున్నాయి. అందుకే ఆ మేక‌ర్స్ ప్ర‌క‌టించే వ‌ర‌కు నువ్వు మ‌న సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌కు` అన్నారు. నేను ఫంక్ష‌న్ హ‌డావిడిలో ఉండి పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారేమో అనుకుని ఆ డేట్‌కి చెన్నై ల‌వ్‌స్టోరీ రాద‌ని చెప్పా` అంటూ క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ నేప‌థ్యంలోనే `పెద్ది` రిలీజ్ డేట్ మారితే న‌ష్ట‌మేంటీ? అనే చ‌ర్చ మొద‌లైంది. గ‌తంలో బాహుబ‌లి`బాహుబ‌లి 2', 'ఆర్ ఆర్ ఆర్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్‌లు చాలా సార్లు వాయిదా ప‌డి ఫైన‌ల్‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. అద్భుత‌మైన విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. `పెద్ది` కూడా అంతే అని అభిమానులు నెటిజ‌న్‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే సినిమా రిలీజ్ వాయిదా ప‌డితే కొంత‌లో కొంత చిన్న సినిమాలు, టైర్ టు హీరోల చిత్రాల‌కు మాత్రం కొంత ఇబ్బందిక‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

`పెద్ది`కి డైరెక్ట్‌గా క‌లిగే న‌ష్టం ఏంటంటే పాట‌ల‌తో వ‌చ్చిన క్రేజ్ కొంత వ‌ర‌కు త‌గ్గుతుంది. ఇక ఇత‌ర సినిమాల విష‌యానికి వ‌స్తే పెద్ది వ‌స్తుందా? అని ముందడుగేసే చిన్న సినిమాలు,టైర్ 2 హీరోల చిత్రాలు ప్ర‌మోష‌న్స్ చేసుకుని తీరా రాద‌నుకున్న సినిమా వ‌చ్చేస్తుందంటే మ‌ళ్లీ త‌మ సినిమాల‌ని వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. అంతే కాకుండా అప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌మోష‌న‌ల్ ఖ‌ర్చు అంతా వృధా అవుతుంది. దీని వ‌ల్ల చిన్న చిత్రాల, టైమ్ 2 సినిమాల మేక‌ర్స్ చాలా వ‌ర‌కు న‌ష్ట‌పోయే ప్రమాదం ఉంది. ఇదంతా జ‌ర‌గొద్దంటే `పెద్ది` రిలీజ్ విషయంలో మేక‌ర్స్ పూర్తి క్లారిటీతో నిర్ణ‌యం తీసుకుని ఈ రోజునే ప‌క్కాగా వ‌స్తున్నామ‌ని ప్ర‌క‌టిస్తే ఎవ‌రికి ఎలాంటి నష్టం ఉండ‌దు.

Tags:    

Similar News