లౌడ్ మ్యూజిక్ మధ్య మెలోడీ సంచలనం.. మణిశర్మ ఈసారైనా గేమ్ మారుస్తారా?
మళ్లీ మెలోడీ బ్రహ్మ మేజిక్ మొదలయ్యిందా? ఈ ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ మధ్య మళ్లీ వినిపిస్తోంది.;
మళ్లీ మెలోడీ బ్రహ్మ మేజిక్ మొదలయ్యిందా? ఈ ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ మధ్య మళ్లీ వినిపిస్తోంది. మణిశర్మ పేరుని ఒకప్పుడు హిట్‌కు గ్యారంటీగా భావించేవారు. కానీ గత కొన్నేళ్లుగా వరుసగా వచ్చిన ఫ్లాపులు ఆయనను రేసులో వెనక్కి నెట్టాయి. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన కంబ్యాక్ తర్వాత కూడా అదే మోమెంటమ్ కొనసాగలేదు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ మాత్రం ఆ సైలెన్స్‌ను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది.
మెలోడీ బ్రహ్మగా గుర్తింపు
ఈ సందర్భంలో నాస్టాల్జియా తప్పక గుర్తుకు వస్తుంది. తన మ్యూజిక్ తో ఎన్నో సినిమాల్లో ఆయన అందించిన మెలోడీలు ఇప్పటికీ ఆడియన్స్ మదిలో నిలిచిపోయాయి. పాటలే కాదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లే సామర్థ్యం కూడా ఆయనకుంది. అయితే అప్పటి మణిశర్మ, ఇప్పటి మణిశర్మలో ఫ్యాన్స్ మిస్సవుతున్నది అదే మెలోడీ మ్యాజిక్.
గుర్తుందా సాంగ్ కు మంచి రెస్పాన్స్
ఇక్కడే ఒక పెద్ద ఇండస్ట్రీ డిబేట్ కూడా వస్తోంది. టాలీవుడ్‌లో మెలోడీ కంపోజర్స్ తగ్గిపోతున్నారనే అభిప్రాయం బలపడుతోంది. ట్రెండ్ పేరుతో హై డెసిబెల్ సౌండ్స్, ఎలివేషన్ బీజీఎంలు పెరిగిన ఈ కాలంలో, క్లాసిక్ మెలోడీకి స్థానం ఉందా అన్న ప్రశ్న సహజంగా వస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ లోని గుర్తుందా గుర్తుందా లాంటి సాఫ్ట్ ట్రాక్ వినిపించడం మ్యూజిక్ లవర్స్‌కి ఓ రిలీఫ్‌లా అనిపిస్తోంది. ఇది కేవలం ఒక పాట కాదు, మెలోడీ ఇంకా బతికే ఉందని చెప్పే సూచనగా కూడా చూడొచ్చు.
ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్ కూడా ఇదే దిశగా ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్స్ చూస్తే, మణిశర్మ నుంచి ఇంకా ఇలాంటి పాటలే కావాలి అనే డిమాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మంచి ట్యూన్ వచ్చిందంటే, అది కేవలం ఒక సాంగ్ సక్సెస్ మాత్రమే కాదు, ఆయనపై ఉన్న నమ్మకాన్ని మళ్లీ రీబిల్డ్ చేసే అవకాశం కూడా. ఇక పోటీ విషయానికి వస్తే, టాలీవుడ్‌లో న్యూ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రెండ్‌ను డామినేట్ చేస్తున్నారు. ఫాస్ట్ బీట్‌లు, పాన్ ఇండియా స్టైల్ సౌండ్‌లతో వారు ముందంజలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మణిశర్మ లాంటి సీనియర్ కంపోజర్ తన స్ట్రెంగ్త్ అయిన మెలోడీతో మళ్లీ నిలబడగలరా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే గుర్తుందా సాంగ్ తో పాటూ ఈ సినిమాలోని పాటలన్నీ ఇదే స్థాయిలో ఉండనున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అదే జరిగితే ఈ సినిమాతో మణిశర్మ మరోసారి కంబ్యాక్ ఇవ్వడం ఖాయమే. అయితే ఇస్మార్ట్ శంకర్ తో ఇచ్చిన కంబ్యాక్ ను వాడుకోలేకపోయిన మణిశర్మ, ఈసారి కంబ్యాక్ దక్కితే, దాన్నైనా సరిగ్గా వాడుకుంటారా లేదా అనేది చూడాలి మరి.