• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్ రెమ్యునరేషన్.. ఏమి...

నయన్ రెమ్యునరేషన్.. ఏమి డిమాండ్ బాబోయ్!

| కానీ ఇప్పుడు నాయనతార 10 కోట్లకు దాటినట్లుగా తెలుస్తోంది. జిఎస్టితో కలిపి ఆమె 11 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం

By - Tupaki Desk
Update: 2023-09-12 10:32 GMT

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త తరహా భామలు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశిస్తున్నారు. అయితే వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక కొంతమంది సీనియర్ హీరోయిన్స్ అయితే నేటి తరం హీరోయిన్స్ కు కూడా గట్టి పోటీని అయితే ఇస్తున్నారు. ఇక అలాంటి వారిలో నయనతార టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.

ఎంతో మంది బ్యూటీలు వస్తున్నారు వెళ్తున్నారు కానీ నయనతారకు పోటీగా మాత్రం ఎవ్వరు నిలబడడం లేదు. ఎందుకంటే ఏదైనా పాత్ర కోసం నయనతార ను ఫిక్స్ చేసుకుంటే మాత్రం దర్శకనిర్మాతలు మరో ఆలోచన చేయడం లేదు. ఆమెకు ఆల్టర్ నేటివ్ గా ఇప్పుడు ఏ హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో లేరు అనేలా ఆమె కెరీర్ కొనసాగుతోంది. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయింది.

ఇక నయనతార రెమ్యునరేషన్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఆమె ముందుకు కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం అయితే సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లిస్టులో కూడా ఆమె నెంబర్ వన్ పొజిషన్లోకి చేరడం విశేషం. ఇక సమంత ఆ తరహా రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నప్పటికీ కూడా ఆమె పారితోషకం ఆరు కోట్లు దాటలేదు.

కానీ ఇప్పుడు నాయనతార 10 కోట్లకు దాటినట్లుగా తెలుస్తోంది. జిఎస్టితో కలిపి ఆమె 11 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చెన్నై వర్గాల్లో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారుతుంది. నయనతారను కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక ప్రముఖ దర్శక నిర్మాతలు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం లైనప్ లో అయితే ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆమెకు జవాన్ తర్వాత అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది బాలీవుడ్ దర్శకులు కూడా ఇప్పటికే నయనతారను సంప్రదించినట్లు సమాచారం. ఇక నెక్స్ట్ అయితే నయనతార నుంచి జయం రవితో ఒక సినిమా రాబోతోంది. ఇక సౌత్ ఇండస్ట్రీలోనే మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. పెళ్లి అయిన తర్వాత ఒక తల్లిగా భార్యగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న నయనతార ఇంకా అగ్ర హీరోయిన్ గా పారితోషకం అందుకుంటూ తన డిమాండ్ ను పెంచుకుంటోంది. ఒక విధంగా ఇటీవల కాలంలో ఇది బెస్ట్ రికార్డు అని చెప్పవచ్చు. మరి ఆమె క్రేజ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.

Tags:    
  • Ladysuperstar 
  • Nayanthara 
  • Nayanthararemuneration 
  • Filmindustry 
  • Jawanmovie 
  • Shahrukhkhan 
  • Vigneshshivan 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS