పిక్ టాక్‌ : ప్రభాస్ హీరోయిన్‌ అందాల జాతర

పదేళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌

Update: 2024-03-12 12:37 GMT

పదేళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఈ అమ్మడు తెలుగు లో చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఆకట్టుకునే అందం తో పాటు యాక్టింగ్ విషయంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకునే సత్తా మరియు స్టామినా ఉన్న ముద్దుగుమ్మ కృతి సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది.

తాజాగా ఒక అవార్డు వేడుకలో ఈ అమ్మడు విభిన్నమైన ఔట్ ఫిట్ లో ఆకట్టుకుంది. క్లీ వేజ్ షో తో పాటు థైస్ ఎక్స్ఫోజ్‌ చేస్తూ ఆకట్టుకునే విధంగా యూనిక్‌ ఔట్ ఫిట్ లో కృతి సనన్‌ చూపు తిప్పుకోనివ్వడం లేదు. బాలీవుడ్‌ కి చెందిన పలువురు ప్రముఖ హీరోయిన్స్ హాజరు అయిన ఈ అవార్డు వేడుకలో కృతి సనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక ఈ అమ్మడి తాజా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్‌ లో పలు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్‌ లో రామ్‌ చరణ్‌ కి జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జాన్వీ కపూర్‌ ను హీరోయిన్‌ గా కన్ఫర్మ్‌ చేసిన జాన్వీ కపూర్‌ మరో హీరోయిన్‌ గా కృతి సనన్ ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Tags:    

Similar News